జుట్టు రాలడం అనేది ప్రస్తుతం సర్వ సాధారణ సమస్యగా మారింది. ఎందుకంటే, నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నాపెద్ద తేడా లేకుండా చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవటం, తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, జుట్టు సమస్యలకు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
జుట్టు రాలడం సమస్యను ఎదుర్కోవటానికి అనేక రకాల మందులు, ఇతర ఉత్పత్తులు మార్కెట్లో అనేకం లభిస్తాయి. కానీ ఈ ఖరీదైన మందులు, ఉత్పత్తులు జుట్టు సమస్యలను పరిష్కరించకపోగా, మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్‌ని కలిగిస్తాయంటున్నారు. ఉల్లిపాయ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చునని చెబుతున్నారు. ఉల్లిపాయ నూనెలో కొన్ని శక్తివంతమైన పదార్థాలు ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే దీనిని ఉపయోగిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. జుట్టు రాలడం సహజంగా ఆగిపోతుంది. మీరు వారానికి ఒకసారి రాత్రిపూట మీ జుట్టుకు ఈ నూనెను అప్లై చేసుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేయాలి. ఉదయాన్నే మీ జుట్టును శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఉల్లిపాయ నూనె తయారీ కోసం అరకప్పు కొబ్బరి నూనె, ఒక సాధారణ పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేయాలి. ఇప్పుడు సన్నని మంట మీద బాగా మరిగించాలి. నూనెలో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత వడకట్టుకోవాలి. గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉల్లిపాయ నూనెను వారానికి కనీసం రెండు సార్లైన మీ జుట్టుకు అప్లై చేసుకుంటే త్వరలోనే మార్పును గమనిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..