ప్రస్తుతం యువతంతా ఫిట్ నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే చందంలో పూర్తి ఊబకాయం రాకముందే వ్యాయామం చేయడానికి ఉత్సాహంగా చుపుతున్నారు. అయితే అంతా ఉదయం వ్యాయామం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు. మారిన జీవన శైలి, నైట్ డ్యూటీల కారణంగా సరైన సమయామనికి వ్యాయామం చేయడం లేదనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతుంది. నిజమే వ్యాయామం చేయడానికి నిర్ధిష్ట సమయం ఉందని నిపుణులు అంటున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేస్తే మేలు అని సూచిస్తున్నారు.
మామూలుగా కుదరడం లేదని చాలా మంది సాయంత్రం వ్యాయామం చేస్తారు..అలాగే కొంత మంది ఉదయం, సాయంత్రం కూడా వ్యాయామం చేస్తారు. అది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో పడుకోవడం శరీరంలోని అన్ని భాగాలకు రెస్ట్ దొరుకుతుందని..కాబట్టి ఉదయాన్నే వ్యాయామం చేస్తే ఆ భాగాలు యాక్టివేట్ అవ్వడానికి దోహదం చేస్తాయి. అదే సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం అప్పటికే శరీర భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
అయితే తీవ్ర ఒత్తిడి ఉన్నామనం వ్యాయామం చేసి మరింత స్ట్రెస్ ఆ భాగాలకు ఇస్తున్నాం. దీంతో అధిక ఒత్తిడి కారణంగా వాతం నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం ఒత్తిడి తీవ్రమైనప్పడు చర్మం పొడిబారడం, ఆందోళన, అమోనోరియా, నిద్రలేమి సమస్య వంటి వాటికి గురవుతాం. అయితే ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉండడంతో రాత్రి సమయంలో మంచి నిద్ర పడుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..