Japanese Women Food Diet: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా నాటి నుంచి ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. దాన్ని తగ్గించుకోవడానికి ఊబకాయులు జిమ్, స్విమ్మింగ్, ఇతర రకాల వర్కవుట్‌లు చేస్తుంటారు. దీంతోపాటు పలు రకాల డైటింగ్‌లను అనుసరిస్తుంటారు. అయితే.. పెరిగిన, లేదా పెరుగుతున్న బరువుకి చాలామంది మహిళలు భిన్నమైన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. కొంతమంది మహిళలు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లను దీనికి కారణమని భావిస్తారు. అయితే జపనీస్ మహిళలు ఆహారపు అలవాట్లను పాటిస్తే.. బరువు పెరగడాన్ని అరికట్టవచ్చని ఓ పరిశోధన చెబుతోంది. ఈ కథనం ద్వారా, జపాన్ మహిళల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి.. వారు అనుసరించే విధానం ఏంటీ అనే విషయాలను మీరు కూడా తెలుసుకోండి..
జపనీస్ మహిళలు ప్యాక్డ్ ఫుడ్ లేదా ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాన్ని తినరు. జపనీస్ ఉమెన్ డోంట్ గెట్ ఓల్డ్ ఆర్ ఫ్యాట్ రచయిత నవోమి మోరియామా తన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపనీస్ మహిళలు ఎల్లప్పుడూ తాజాగా తయారుచేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే భారత్‌తో పాటు అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుల్లో ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని తినే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. పాత ఆహారంలో టాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. అవి తిన్న తర్వాత బరువుగా అనిపిస్తుంది.
వండిన ఆహారంలో పోషక విలువలు కొంతకాలం తర్వాత తగ్గడం ప్రారంభిస్తాయి. ఆహారంలో ఉండే అనేక ఎంజైములు, విటమిన్లు క్షీణించి విషపూరితం అవుతాయి. మరోవైపు, గడ్డకట్టిన మాంసంలో ఉప్పును అధికంగా ఉపయోగించడం వల్ల కూడా రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. కొన్ని హానికరమైన బ్యాక్టీరియా తక్కువ ఉష్ణోగ్రతలలోనూ వృద్ధి చెంది ఆహారాన్ని పాడు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2005లో న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. జపనీస్ ప్రజలకు శాఖాహారం అంటే ఇష్టం. ఏ జపనీస్ స్త్రీని ఎక్కువగా వండడానికి ఇష్టపడతారు అని అడిగితే.. ఆకుపచ్చ బీన్స్, క్యారెట్, బచ్చలికూర, ఉల్లిపాయలు, టొమాటోలు, అనేక ఇతర జపనీస్ కూరగాయల వండుతామని సమాధానం ఇచ్చారు. ఇంకా ఉడికించిన కూరగాయలను తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రెడ్ మీట్ ను పూర్తిగా నిరాకరిస్తారని తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..