Kitchen Tips: మీ గ్యాస్‌ స్టౌవ్‌, బర్నర్స్‌ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే నిమిషాల్లోనే మెరిసిపోతాయి!

Kitchen Tips: గ్యాస్ స్టౌవ్‌పై ఉన్న మొండి మరకాలతో పాటు వంట చేసేటప్పుడు పడే మరకాలు సులభంగా పోగొట్టవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లోనే మీ గ్యాస్‌ సౌవ్‌ను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ స్టౌను శుభ్రం చేసుకునేందుకు రకరకాల లోషన్స్‌ వాడాల్సిన అవసరం..

Kitchen Tips: మీ గ్యాస్‌ స్టౌవ్‌, బర్నర్స్‌ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే నిమిషాల్లోనే మెరిసిపోతాయి!

Updated on: Oct 28, 2025 | 12:31 PM

Kitchen Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్స్టౌవ్ఎంత శుభ్రంగా ఉంటే వంట చేసేందుకు మనకి అంత మోటివేషన్‌గా ఉంటుంది. అందుకే, ఎప్పటికప్పుడు స్టౌని శుభ్రం చేసుకోవాలి. కానీ, ఇది చాలా పెద్ద టాస్క్ అనుకుంటారు. కానీ వెరీ సింపుల్అని అందరికి తెలియదు. ఎందుకంటే పాలు, పప్పు, అన్నం పొంగు వంటివన్నీ స్టౌపై పడతాయి. వీటిని క్లీన్ చేయడం చాలా కష్టమనుకుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే సులభంగా స్టౌవ్పై ఉన్న మొండి మరకాలతో పాటు వంట చేసేటప్పుడు పడే మరకాలు సులభంగా పోగొట్టవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లోనే మీ గ్యాస్సౌవ్ను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ స్టౌను శుభ్రం చేసుకునేందుకు రకరకాల లోషన్స్వాడాల్సిన అవసరం లేదుఅంతే కాదు శుభ్రం చేసేందుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులతోనే స్టౌవ్ను నిమిషాల్లోనే శుభ్రం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. అయితే క్లీన్ చేసే ముందు కొన్ని పనులు చేయాలి. అవేంటో చూద్దాం.

ఇది కూడా చదవండి: Business Idea: కోటీశ్వరులు కావాలనుకుంటే ఈ మొక్కలను నాటండి.. ఎకరాకు కోటి రూపాయలు!

ఇవి కూడా చదవండి

వంట సోడాఇంట్లో ఉండే బేకింగ్సోడాతోనే మీ గ్యాస్ స్టౌవ్ను శుభ్రం చేసుకోవచ్చు. బేకింగ్సోడాని చాలా ఇళ్లల్లో సోడా తప్పకుండా ఉంటుంది. ఇందులో మరకలు, జిడ్డు వంటి వాటిని శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి. అందుకే బేకింగ్ సోడాతో చక్కగా క్లీన్ చేయాలి. దానికంటే ముందు మనం కొన్ని పనులు చేయాలి. అయితే మీరు గ్యాస్స్టౌవ్ను క్లీన్చేసుకునే ముందు కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..

  • ముందుగా మనం గ్యాస్ స్టౌని ఆఫ్ చేయాలి. తర్వాత ఓ గుడ్డతో ఓసారి పైపైన తుడవండి.
  • తర్వాత బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు పోసి పేస్టులా తయారు చేయండి.
  • సోడాను పేస్ట్లా చేసి గ్యాస్ స్టౌ మరకలపై అప్లై చేయండి.
  • దీనిని ఎంత ఎక్కువసేపు ఉంచితే అంతగా మరకలు క్లీన్ అవుతాయి. ​
  • దీనికోసం 15 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేయాలి.
  • తర్వాత ఓ స్క్రబ్ తీసుకుని స్టౌపై స్క్రబ్ చేయండి.
  • ఆ తర్వాత తడిగుడ్డతో బేకింగ్ సోడాని క్లీన్ చేయండి.
  • తర్వాత మ్యాజిక్ అనిపించేలా గ్యాస్ స్టౌ మెరుస్తుంది.

వెనిగర్‌తో..: ఇప్పుడు బేకింగ్ సోడాతోనే చేస్తుంటాం. అయితే, అందులో కలిపే పదార్థాలనీ మారిస్తే మరకలు పోయి స్టౌ క్లీన్ అవుతుంది. ముందుగా బేకింగ్ సోడాలో నీరు బదులు వెనిగర్ వేసి పేస్టులా చేయండి. తర్వాత మరకలపై స్టౌపై రాసి 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేసి ఆ తర్వాత మరోసారి పొడిగుడ్డతో క్లీన్ చేయండి. అంతే స్టౌ తళతళ మెరిసిపోతుంది.

బర్నర్స్: కొత్తగా కొన్న బర్నర్స్ చక్కగా బంగారంలా మెరుస్తాయి. కానీ, వీటిని వాడిన కొద్దీ నల్లగా తుప్పు పట్టిపోతాయి. వీటిని కూడా క్లీన్ చేయాలి. దీనికోసం ముందుగా బర్నర్స్‌ని వేడి చేయాలి. అంటే స్టౌ ఆన్ చేసి కాసేపు ఉండాలి. తర్వాత వాటికి కొద్దిగా నిమ్మరసం రాయాలి. వీటిని 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో క్లీన్ చేయాలి. దీంతో మరకలు పోతాయి.

వాటర్, ఉప్పు: దీంతో పాటు బర్నర్స్‌ని ఉప్పు నీటిలో వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి మరకలు ఉన్న చోట రుద్దండి. వెంటనే పోతాయి. అంతేకాదు కొత్తవాటిలా మెరుస్తాయి.

డిష్‌వాష్ లిక్విడ్: ఇక రెండు టేబుల్ స్పూన్ డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి కూడా శుభ్రం చేస్తే మెరిసిపోతాయి. లిక్విడ్ను గోరువెచ్చని నీటితో కలిపి అందులో బర్నర్స్‌ని వేసి నానబెట్టండి. చాలా సేపు నానిన తర్వాత మైల్డ్ డిటర్జెంట్‌తో బర్నర్స్‌ని 20 నుంచి 30 నిమిషాల పాటు రుద్ది క్లీన్ చేయండి. దీంతో బర్నర్స్ తళతళ మెరిసిపోతాయి. ఇలా ఇంటి చిట్కాలను ఉపయోగించి శుభ్రం చేస్తే నిమిషాల్లోనే మెరిసిపోతాయి.

ఇది కూడా చదవండి: Petrol, Diesel: మీ వాహనంలో ఈ పెట్రోల్‌ కొట్టిస్తున్నారా? మైలేజీ, పికప్‌ పోయినట్లే..!