How to Store Potatoes: బంగాళాదుంపలు కొన్ని రోజులకే మొలకెత్తుతున్నాయా..? అయితే ఈ ట్రిక్‌ ఫాలో అవ్వండి

|

Jan 10, 2025 | 2:56 PM

ఎక్కువకాలం పాడవకుండా ఉండే కూరగాయల్లో బంగాళాదుంపలు ఒకటి. అయితే ఇవి త్వరగా మొలకెత్తుతాయి. చాలా మంది మొలకెత్తిన బంగాళా దుంపలను వంటకు వినియోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే బంగాళాదుంపలు ఎక్కువ కాలం ఇలా మొలకెత్తకుండా తాజాగా ఉండాలంటే ఏం చేయాలంటే..

How to Store Potatoes: బంగాళాదుంపలు కొన్ని రోజులకే మొలకెత్తుతున్నాయా..? అయితే ఈ ట్రిక్‌ ఫాలో అవ్వండి
Potatoes
Follow us on

ఇంట్లో వేరే ఏ కూరగాయలు లేకుంటే అందరి బెస్ట్ ఆప్షన్‌ బంగాళదుంపలు. వీటితో రుచికరమైన సాంబారు చేసుకోవచ్చు, కుర్మా చేసుకోవచ్చు, ఫ్రై, కర్రీ.. ఇలా ఏది చేసిన రుచి బలేగా ఉంటుంది. అయితే బంగాళదుంపలను మార్కెట్‌ నుంచి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇవి త్వరగా కుళ్ళిపోతాయి. చల్లటి వాతావరణంలో మొలకెత్తుతాయి కూడా. కానీ ఈ పద్ధతిని పాటిస్తే బంగాళదుంపలు చెడిపోకుండా, మొలకెత్తకుండా చాలా నెలలపాటు నిల్వ చేసుకోవచ్చు. ఎలాగంటే..

బంగాళాదుంపలు మొలకెత్తకుండా ఉండటానికి ఉత్తమ మార్గం వాటిని నిల్వ చేయకుండా ఉండటం. కాబట్టి అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయడం మంచిది.

బంగాళాదుంపలను చల్లని, చీకటి, బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశంలో నిల్వ చేయాలి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం అంత తెలివైన పనికాదు. చల్లని వాతావరణం పిండి పదార్ధాలను చక్కెరలుగా మారుస్తుంది. తద్వారా రుచి మారుతుంది.

ఇవి కూడా చదవండి

అధిక తేమ మొలకలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి బంగాళాదుంపలను సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులు పేపర్ బ్యాగ్, బుర్లాప్ బ్యాగ్, బాస్కెట్ వంటి గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచడం మంచిది.

బంగాళాదుంపలను ఉల్లిపాయలు లేదా అరటి పండుతో నిల్వ చేయవద్దు. ఇవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. ఇది బంగాళాదుంపలు వేగంగా మొలకెత్తేలా చేస్తాయి.

నల్ల మచ్చలు, దెబ్బతిన్న బంగాళాదుంపలను కొనుగోలు చేయవద్దు. మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.

బంగాళదుంపలను సూర్యరశ్మికి వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. అధిక కాంతి పచ్చదనాన్ని ప్రేరేపిస్తుంది. క్లోరోఫిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. పచ్చదనం బంగాళాదుంపలను చేదుగా చేస్తుంది. తద్వారా రుచి మారుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.