AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: తెల్లని దుస్తులు పసుపు రంగులోకి మారాయా..! ఈ వంటింటి టిప్స్ మీ కోసం..

కొన్నిసార్లు బట్టలకు తగిన నిర్వహణ లేకపోవడం వల్ల.. తెల్ల రంగు దుస్తులు పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత చాలా మంది ఈ రంగును తొలగించడానికి మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ తెల్లటి బట్టల నుండి పసుపు రంగు అదృశ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఆ తెలుపు రంగు దుస్తులు ఎంత మంచివి అయినా సరే మళ్ళీ ధరించాలనిపించదు. మళ్లీ ధరించినా మంచి అనుభూతిని ఇవ్వదు. మెరుపు కోల్పోయిన తెల్లని దుస్తులు మళ్ళీ అందంగా కనిపించాలంటే ఈ సులభమైన టిప్స్ ని అనుసరించండి.

Kitchen Hacks: తెల్లని దుస్తులు పసుపు రంగులోకి మారాయా..! ఈ వంటింటి టిప్స్ మీ కోసం..
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Jun 13, 2024 | 2:28 PM

Share

ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల బట్టలు ఉన్నా.. సరే.. సప్తవర్ణాల సంగమం అయిన తెలుపు రంగు అంటే అందరికి ఇష్టమే. పండగులు, పర్వదినాలు ఫంక్షన్లు ఇలా ఎ సందర్భంలోనైనా ఎక్కువగా తెలుపు రంగు దుస్తులను ధరించడానికి ఎక్కువగా ఇష్టపడేవారున్నారు. తెలుపు రంగు దుస్తులు సాధారణ లేదా ప్రత్యేక సందర్భాలలో ఖచ్చితంగా సరిపోతాయి. అయితే కొన్నిసార్లు బట్టలకు తగిన నిర్వహణ లేకపోవడం వల్ల.. తెల్ల రంగు దుస్తులు పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత చాలా మంది ఈ రంగును తొలగించడానికి మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ తెల్లటి బట్టల నుండి పసుపు రంగు అదృశ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఆ తెలుపు రంగు దుస్తులు ఎంత మంచివి అయినా సరే మళ్ళీ ధరించాలనిపించదు. మళ్లీ ధరించినా మంచి అనుభూతిని ఇవ్వదు. మెరుపు కోల్పోయిన తెల్లని దుస్తులు మళ్ళీ అందంగా కనిపించాలంటే ఈ సులభమైన టిప్స్ ని అనుసరించండి.

తెల్ల రంగు దుస్తుల నుంచి పసుపు రంగును తొలగించడానికి ఈ ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

తెలుపు దుస్తులపై తరచుగా కొన్ని మరకలు పడుతూ ఉంటాయి. అపుడు ఈ బట్టలు చెడిపోతాయి. అంతే కాదు ఎక్కువ కాలం తెల్లని దుస్తులు ధరించకపోవడం వల్ల వాటి మెరుపు పోతుంది. అటువంటి పరిస్థితిలో వాటికి తిరిగి మెరుపు తీసుకురావడానికి వైట్ వెనిగర్ ను ఉపయోగించవచ్చు.

వెనిగర్ తో ఎలా శుభ్రం చేయాలంటే..

  1. ముందుగా ఒక బకెట్‌లో నీటిని తీసుకోవాలి. ఇప్పుడు నీటిలో ఒక క్యాప్ఫుల్ వెనిగర్ వేయండి.
  2. వెనిగర్ జోడించిన తర్వాత.. చేతులతో నీటిని కదిలించండి.. తద్వారా వెనిగర్ బాగా కలుపుతుంది.
  3. ఇప్పుడు ఉతికిన తెల్లటి బట్టలను ఆ నీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి.
  4. 20 నిమిషాల తర్వాత తెల్లటి దుస్తులను తీసుకుని చేతుల సహాయంతో వాటిని రబ్ చేసి శుభ్రం చేయండి.
  5. అయితే వెనిగర్ ను తెల్లటి పట్టు దుస్తులకు లేదా తెల్లటి రేయాన్ దుస్తులకు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

నిమ్మరసం ఉపయోగించండి

  1. తెలుపు బట్టలు నుంచి పసుపు రంగును తొలగించడానికి ఒక బకెట్లో నీటిని తీసుకోండి.
  2. ఇప్పుడు అందులో నిమ్మకాయను కోసి బకెట్ లో నిమ్మ రసాన్ని పిండాలి.
  3. నీరు, రసం బాగా కలపండి.
  4. ఇప్పుడు అందులో ఉతికిన తెల్లటి బట్టలను నానబెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
  5. 20 నిమిషాల తర్వాత చేతుల సహాయంతో తెల్లటి బట్టలను రుద్ది శుభ్రం చేయండి.

బేకింగ్ సోడా, డిటర్జెంట్ ఉపయోగించండి

  1. తెల్లని బట్టల నుండి పసుపు రంగును తొలగించడానికి ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకుని వేడి చేయండి.
  2. ఇప్పుడు గోరువెచ్చని నీటిలో నీరు కలపి తర్వాత బేకింగ్ సోడా, డిటర్జెంట్ వేసి కలపాలి.
  3. వీటిని బాగా కలిపిన తర్వాత ఆ నీటిలో తెల్లటి దుస్తులు వేసి 20 నిమిషాలు నానబెట్టండి.
  4. సమయం ముగిసిన తర్వాత తెల్లటి దుస్తులను తీసి, మెత్తని బ్రష్ సహాయంతో రుద్ది బట్టలను శుభ్రం చేయండి.

ఈ వంటింటి టిప్స్ సహాయంతో కళ తప్పిన తెల్లటి దుస్తులకు మెరుపుని తిరిగి తీసుకురావచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్