Skin Care With Potato: బంగాళాదుంపతో ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, పిగ్మంటేషన్ మాయం.. అందం రెట్టింపు..!

ఇది ముఖంలోని మురికిని, మృతచర్మాన్ని, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా, బంగాళాదుంప ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తొలగిస్తుంది. దీంతో మచ్చలు, పిగ్మెంటేషన్, టానింగ్ సమస్యల నుండి బయటపడవచ్చు. బంగాళాదుంపతో స్కిన్ కేర్ ను ముఖంపై ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం...

Skin Care With Potato: బంగాళాదుంపతో ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, పిగ్మంటేషన్ మాయం.. అందం రెట్టింపు..!
Skin Care With Potato
Follow us

|

Updated on: Jun 13, 2024 | 3:47 PM

దుమ్ము దూళి, కాలుష్యం, చెడు జీవనశైలి, కెమికల్‌ ఆధారిత సౌందర్య ఉత్పత్తుల వాడకం కారణంగా చర్మం క్రమంగా తన మెరుపును కోల్పోతుంది. ముఖం అందంగా ఉండాలంటే చాలా మంది పార్లర్‌లకు వెళ్లి ఖరీదైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకుంటుంటారు. కానీ హానికరమైన రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో మెరిసే చర్మం కోసం బంగాళాదుంప చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బంగాళాదుంప చర్మంలోకి లోతుగా వెళ్లి శుభ్రపరుస్తుంది. ఇది ముఖంలోని మురికిని, మృతచర్మాన్ని, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా, బంగాళాదుంప ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తొలగిస్తుంది. దీంతో మచ్చలు, పిగ్మెంటేషన్, టానింగ్ సమస్యల నుండి బయటపడవచ్చు. బంగాళాదుంపతో స్కిన్ కేర్ ను ముఖంపై ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం…

బంగాళదుంప రసం..

1. మెరిసే చర్మం కోసం, బంగాళదుంపలను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని రసం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. ఇప్పుడు కాటన్ బాల్ తో ముఖం, మెడపై అప్లై చేయండి.

3. దాదాపు 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి 10 నిమిషాల పాటు ముఖంపై అలాగే ఉంచాలి.

4. దీని తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.

5. బంగాళాదుంప చర్మం లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. మురికి, అదనపు నూనెను తొలగిస్తుంది.

6. బంగాళాదుంపను ముఖం, మెడ చర్మంపై క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు.

బంగాళదుంప, పెరుగు

1. ముందుగా బంగాళదుంపలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

2. రెండు చెంచాల పెరుగు, చిటికెడు పసుపు వేసి కలపాలి.

3. ఇప్పుడు ముఖంపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచి ఆరనివ్వాలి.

4. ఇప్పుడు నీళ్లతో ముఖాన్ని బాగా కడగాలి.

5. దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల మెరిసే, మచ్చలేని చర్మం ఏర్పడుతుంది.

బంగాళదుంప, అలోవెరా

1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల అలోవెరా జెల్ తీసుకోవాలి.

2. అందులో రెండు చెంచాల బంగాళదుంప రసం కలపండి.

3. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి.

4. ఆరిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

5. దీన్ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

బంగాళాదుంప, టమోటా రసం

1. ఒక గిన్నెలో ఒక చెంచా బంగాళదుంప రసం తీసుకోండి.

2. ఒక చెంచా టమోటా రసం, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి.

3. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

4. దీని తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.

5. ఈ ఫేస్ ప్యాక్‌తో మీరు మొటిమలు, మచ్చలను వదిలించుకోవచ్చు. దీని వల్ల ముఖం ఛాయ కూడా మెరుగుపడుతుంది.

బంగాళదుంప ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. అయితే, సున్నితమైన చర్మం ఉన్నవారు బంగాళాదుంపలను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..