- Telugu News Photo Gallery Pumpkin Juice For Weight Loss and obesity, Health Benefits of Pumpkin in Telugu
గుట్టలా మారిన పొట్టకు సూపర్ జ్యూస్.. పరగడుపున ఒక్క గ్లాస్ తాగారంటే దెబ్బకు కొవ్వు కరిగిపోవాల్సిందే..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఏదో ఒక రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అందుకే.. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది.
Updated on: Jun 13, 2024 | 4:12 PM

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఏదో ఒక రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అందుకే.. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. అలాంటి పోషక పదార్థాల్లో గుమ్మడికాయ ఒకటి.. గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుమ్మడి కాయతో.. జ్యూస్, సాంబార్, హల్వా ఇలా రకరకాల ఆహారాన్ని తయారు చేసుకుని తినవచ్చు.

అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న గుమ్మడికాయను కొందరు ఇష్టపడతారు.. మరికొందరు గుమ్మడికాయను చూసి మొహం తిప్పుకుంటారు. గుమ్మడికాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే.. మీరు ఇక రోజూ తింటారు. ఇది అన్ని రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. గుమ్మడికాయ మాత్రమే కాదు, దాని పై తొక్క, విత్తనాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే గుమ్మడికాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా గుమ్మడికాయ తినడం చాలా ప్రయోజనకరం. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కానీ గుమ్మడికాయను ఎప్పుడూ వేయించి తినకూడదు. ఈ పొరపాటు చేస్తే బరువు తగ్గడమేమో కానీ.. బరువు పెరగడం ఖాయం.. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చి విషపదార్థాలను బయటకుపంపుతుంది.

గుమ్మడికాయ మన శరీరాన్ని సులభంగా బరువు తగ్గించేలా చేస్తుంది. 245-50 గ్రాముల గుమ్మడికాయలో 50 కేలరీలు మాత్రమే లభిస్తాయి. గుమ్మడికాయ తింటే చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. గుమ్మడి గింజలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, విటమిన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ గుమ్మడికాయ తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

గుమ్మడికాయను ఉదయాన్నే తీసుకోవడం మంచిది.. పరగడుపున గుమ్మడి కాయతోపాటు.. కొంచెం అల్లం వేసి మిక్స్ చేయాలి.. ఆ తర్వాత వడగట్టి జ్యూస్ తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరిగిపోతుంది.




