- Telugu News Photo Gallery Garlic Health Benefits Boosts Immunity Healthy Heart and lose weight Telugu lifestyle news
Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..
పచ్చి వెల్లుల్లి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మెదడు పనితీరుకి సహాయపడి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది.
Updated on: Jun 12, 2024 | 10:03 PM

జలుబు వచ్చినా, స్కిన్ ఇన్‌ఫెక్షన్ అయినా, ఒక్క వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి కూడా వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

పచ్చివెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు శక్తి కూడా తక్షణమే పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ సీజనల్ వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చిగా తిన్నా ఉడికించి తిన్న కానీ ఇందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం మన శరీరానికి అందుతాయి.

పచ్చి వెల్లుల్లి ఎంత ప్రయోజనకరమో, జీర్ణం కావడం అంతే కష్టం. అందుకే చిన్న పిల్లలకు పచ్చి వెల్లుల్లి తినిపించకూడదు. అలాగే వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. కాబట్టి బ్లడ్ థినర్స్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు.

వెల్లులిలో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఎక్కువ. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి. అంటువ్యాధులను నివారిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. సాల్మొనెల్లా, ఈ. కోలి వంటి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి.




