AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seasonal Diseases: ఇవి ట్రై చేస్తే సీజనల్ వ్యాధులు ఇట్టే మాయం అయిపోతాయి!

ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడే వర్షం పడినా.. మళ్లీ ఎండ వస్తుంది. ఇలా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. వచ్చేది వర్షాకాలం కూడా కాబట్టి.. సరైన జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. వ్యాధులతో పోరాడాల్సి వస్తుంది. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి..

Seasonal Diseases: ఇవి ట్రై చేస్తే సీజనల్ వ్యాధులు ఇట్టే మాయం అయిపోతాయి!
seasonal diseases
Chinni Enni
|

Updated on: Jun 13, 2024 | 2:01 PM

Share

ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడే వర్షం పడినా.. మళ్లీ ఎండ వస్తుంది. ఇలా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. వచ్చేది వర్షాకాలం కూడా కాబట్టి.. సరైన జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. వ్యాధులతో పోరాడాల్సి వస్తుంది. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమస్యల నుంచి బయట పడటానికి చాలా రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాటి బదులు ముందు నుంచే ఇంట్లో ఉపయోగించే చిట్కాలను ట్రై చేస్తే.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి జలుబు చేస్తుంది. వారం అయినా ఈ జలుబు దగ్గదు. జలుబుతో దగ్గు, జ్వరం కూడా ఎటాక్ చేస్తాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే శరీరం సిద్ధంగా ఉండాలి.

ఇలా చేయండి:

వాతావరణం పరిస్థితులు మారుతున్నప్పుడు సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. మీకు తెలీయకుండానే మీ శరీరంలో మార్పులు జరుగుతాయి. మీకు జలుబు, దగ్గు, జ్వరం వస్తున్నట్టు అనిపిస్తే ముందుగానే అలర్ట్ అవ్వండి. ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు తీసుకోండి.

సుగంధ ద్రవ్యాలు:

సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బల పరుస్తాయి. అల్లం, పసుపు, మిరియాలు, మెంతులు, పుదీనా, తులసి ఆకులు ఇలాంటివి.

ఇవి కూడా చదవండి

ఉప్పు నీటి ఆవిరి:

ఉప్పు నీటిని పుక్కిలించినా, ఉప్పు నీటితో ఆవిరి పట్టించినా.. జలుబు, దగ్గు రెండూ తగ్గుతాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లు పెరగకుండా చేస్తాయి.

మిరియాల పాలు:

జలుబు, దగ్గు తగ్గేందుకు మిరియాల పాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. గ్లాసుడు గోరు వెచ్చటి పాలల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. జలుబు ఎక్కువగా ఉంటే రోజుకు రెండు సార్లు తాగవచ్చు.

హెర్బల్ టీలు:

జలుబు, దగ్గు, జ్వరం వంటివి తగ్గడానికి బాడీని హైడ్రేట్‌గా ఉంచాలి. నీళ్లు తాగకపోతే హెర్బల్ టీలు తాగండి. అల్లం, పసుపు, తులసి, పుదీనా, జీలకర్ర, ధనియాలు, నిమ్మరసం ఇలాంటివి అలసటను కూడా తగ్గిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్