Keto Diet: కీటో డైట్ మంచిదే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారికి మాత్రం హానికరం..

|

Nov 28, 2024 | 11:48 AM

బరువు తగ్గడానికి ప్రస్తుతం అనేక రకాల డైట్స్ అందుబాటులోకి వచ్చాయి. రకరకాల ఆహార పదార్ధాలు బరువు తగ్గడానికి చాలా ప్రసిద్ధి చెందాయి. ఇలాంటి డైట్స్ లో కీటో డైట్ ఒకటి. అయితే కొంతమంది కీటో డైట్ అస్సలు పాటించవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు కీటో డైట్‌ని అనుసరించకూడదని చెబుతున్నారు.

Keto Diet: కీటో డైట్ మంచిదే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారికి మాత్రం హానికరం..
Keto Diet Side Effects
Follow us on

ప్రస్తుతం దిగజారుతున్న జీవనశైలి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇందులో ఊబకాయం కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేస్తున్నారు. మొదటి, రెండవ అంతస్తులకు చేరుకోవడానికి కూడా లిఫ్ట్‌లను ఉపయోగిస్తారు. అంతేకాదు శారీరక శ్రమ తగ్గడంతో పాటు అనారోగ్యకరమైన, వేయించిన ఆహరాన్ని, మసాలా ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. దీంతో ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీంతో పొట్ట, శరీరంలోని ఇతర ప్రాంతాలలో కొవ్వు పేరుకుపోతుంది.

స్థూలకాయం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీంతో భారీ కాయాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రకాల వ్యాయామాలు, యోగా, జిమ్, ఆహారం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది. సరైన దినచర్య, ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే తక్కువ సమయంలో శరీరంలో తేడా కనిపిస్తుంది. బరువు తగ్గడానికి చాలా రకాల డైట్‌లు అనుసరిస్తారు. వాటిలో ఒకటి కీటో డైట్. ఇది చాలా ఫేమస్.

కీటో డైట్ అంటే ఏమిటంటే

కీటో డైట్‌ని కీటోజెనిక్ డైట్ అని కూడా అంటారు. ఈ డైట్ బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ డైట్ లో తీసుకునే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ కొవ్వు ఉన్నవి వినియోగిస్తారు. అంతే కాదు ఈ ఆహారంలో ప్రోటీన్ కూడా సాధారణ పరిమాణంలో వినియోగించబడుతుంది. కీటో డైట్‌లో తిన్న తర్వాత శరీరానికి శక్తిని అందించే అటువంటి ఆహారాలు తీసుకుంటారు. అయితే ఒకరి శరీర తత్వానికి భిన్నంగా మరొక శరీర తీరు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కీటో డైట్‌ని కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు పాటించవద్దు అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మధుమేహ రోగులు: డయాబెటిక్ పేషెంట్లు కీటో డైట్‌ను పాటించకూడదని.. దీని వల్ల వారు పెద్ద హైపోగ్లైసీమియాతో బాధపడే అవకాశం ఉందని డైటీషియన్ మేధావి గౌతమ్ చెప్పారు. ఎందుకంటే కీటో డైట్‌లో కార్బోహైడ్రేట్లు పూర్తిగా శరీరానికి అందడం ఆగిపోతాయి.

కిడ్నీ సమస్య: కిడ్నీ పేషెంట్లు కూడా కీటో డైట్‌ని అనుసరించకూడదు ఎందుకంటే ఈ డైట్‌లో ప్రొటీన్ , కొవ్వు మాత్రమే భారీగా ఇస్తారు. ఇది కిడ్నీ రోగికి హానికరం.

ప్రకోప ప్రేగు సిండ్రోమ్: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్) పేషెంట్లు కూడా కీటో డైట్ పాటించకూడదని డాక్టర్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ డైట్‌లో ఫైబర్ చాలా తక్కువ పరిమాణంలో ఇవ్వబడుతుంది. దీంతో డయేరియా సమస్య బారిన పడే అవకాశం ఉంది. IBS అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య, ఇది కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది.

గర్భధారణ, పిల్లలు పాలు ఇచ్చే సమయంలో: గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు కూడా కీటో డైట్‌ని అనుసరించకూడదు. ఎందుకంటే ఈ రెండు పరిస్థితుల్లోనూ స్త్రీకి అన్ని రకాల పోషకాహారం అవసరం, ఇవి కీటో డైట్ ద్వారా అస్సలు లభించవు. అందువల్ల ఈ సమయంలో వారు సమతుల్య ఆహారం తీసుకోవాలి, తద్వారా తల్లికి బిడ్డకు అన్ని పోషకాలను లభిస్తాయి. చిన్న పిల్లలు కూడా బరువు తగ్గడానికి కీటో డైట్‌ని పాటించకూడదు.

బోలు ఎముకల వ్యాధి, గుండె రోగులు: ఎముకలు బలహీనంగా ఉన్నవారు లేదా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు కీటో డైట్‌ను పాటించకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఆహారంలో కీటో ఆమ్లాలు ఉన్నందున ఎముకలపై ఖనిజ ప్రభావాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతే కాదు హృద్రోగులు కూడా కీటో డైట్ పాటించకూడదు.

 

మరిన్ని లైఫ్‌‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)