Brisk Walking: రోజుకు ఏడు నిమిషాలు కేటాయించండి చాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.. అసలు విషయం తెలుసుకోండి..

|

Mar 13, 2023 | 10:48 AM

ఇటీవల కాలంలో గుండె జబ్బులు అధికమయ్యాయి. అ‍ప్పటి వరకూ బాగానే ఉన్నవారు కూడా అకస్మాత్తుగా కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యి కుప్పకూలిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చురుకైన నడక మీ గుండెకు భరోసా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Brisk Walking: రోజుకు ఏడు నిమిషాలు కేటాయించండి చాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.. అసలు విషయం తెలుసుకోండి..
Walking
Follow us on

నడక నాలుగు విధాలా మంచిదని అందరూ చెబుతుంటారు. దానిని పాటించేవారు చాలా తక్కువ. అయితే కరోనా సంక్షోభం తర్వాత రోజు వాకింగ్‌ లేదా జాగింగ్‌ చేసే వారి సంఖ్య కాస్త పెరిగిందనే చెప్పాలి. అయితే ఎలా నడవాలి? అనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. ఏదో చెయ్యమన్నారు కాబట్టి రోజూ నాలుగు అడుగులు వేద్దాంలే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దాని వల్ల అంతగా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతు‍న్నారు. అయితే చురుకైన నడక(brisk walking)తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ వారు చేసిన అధ్యయనం కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా రోజూ ఏడు నిమిషాల చురుకైన నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించింది. అలాగే స్ట్రోక్‌, క్యాన్సర్‌ సమస్యలను కూడా నివారిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రోజుకు ఏడు నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు..

శారీరక శ్రమ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. అది లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. శారీరక శ్రమ లేకనే చాలా రోగాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రోజూ ఈ చురుకైన నడకను ప్రాక్టీస్‌ చేస్తే కనీసం గుండె జబ్బులతో సంభవించే 10 మరణాలలో కనీసం ఒకరినైనా కాపాడవచ్చని వివరించింది. రోజూ ఏడు నిమిషాలు లేదా.. వారానికి 75 నిమిషాలు చురుకైన నడక నడవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆ అధ్యయనం నిరూపించింది.

బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే..

వాకింగ్‌ అంటే అందరికీ అర్థం అవుతుంది. కానీ బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే కొత్తగా చూస్తారు. బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే మామూలుగా నడిచే వేగానికన్నా కొంచెం ఫాస్ట్‌గా నడవడమే. క్లియర్‌ కట్‌గా చెప్పాలంటే చిన్నపాటి పరుగులాంటి నడక. దీని వల్ల కండ‌రాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి. అలాగే శరీరంలో అధిక కేలరీలు ఖర్చయ్యి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

గుండెకు ప్రయోజనం..

బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అధ్యయనంలో ఈ బ్రిస్క్‌ వాకింగ్‌ గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తుందని నిపుణులు వివరించారు. చురుకుగా నడక చేసినప్పుడు గుండె స్పందన రేటు పెరుగుతుంది. శ్వాస వేగంగా, లోపలికి తీసుకుంటాం. ఫలితంగా ఇది కార్డియోవాస్కులర్‌ వ్యాధులను దూరం చేయడానికి దోహదపడుతుంది. అలాగే గుండె కండరాలు బలోపేతం అవుతాయి. పలితంగా శరీరం అంతటా రక్త సజావుగా ప్రవహించడానికి వీలవుతుంది. అలాగే గుండె మంటను కూడా తగ్గించడానికి సాయపడుతుంది.

ఇతర ప్రయోజనాలు..

క్రమం తప్పకుండా చురుకైన నడకలు హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు టైప్ 2 మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చురుకైన నడక ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి లేదా బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గం, ఇది మళ్లీ గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక బరువు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..