Jamun Fruit for Diabeties: నేరేడు పండ్లు, గింజలు తింటే.. దెబ్బకు షుగర్‌ కంట్రోల్!

ఆపిల్, నారింజ, అరటి పండ్లు తప్ప మరే ఇతర పండ్లను ఏడాదంతా దొరకవు. ముఖ్యంగా మన దేశంలో పండే సీజనల్‌ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో నేరేడు పండ్లు ముఖ్యమైనవి. వీటిల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..

Jamun Fruit for Diabeties: నేరేడు పండ్లు, గింజలు తింటే.. దెబ్బకు షుగర్‌ కంట్రోల్!
Jamun Fruits

Updated on: Jun 15, 2025 | 1:38 PM

ప్రతి సీజన్‌లో ఆయా కాలాల్లో వచ్చే సీజనల్‌ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తూ ఉంటాయి. అవి ఆయా ప్రత్యేక సీజన్‌లోనే దొరకుతాయి. అంతేగానీ మానకు కావలసినప్పుడు అవి దొరకవు. కాబట్టి ఏడాది పొడవునా దొరకని సీజనల్‌ పండ్లను ఎక్కువగా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆపిల్, నారింజ, అరటి పండ్లు తప్ప మరే ఇతర పండ్లను ఏడాదంతా దొరకవు. ముఖ్యంగా మన దేశంలో పండే సీజనల్‌ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో నేరేడు పండ్లు ముఖ్యమైనవి. వీటిల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..

నేరేడు పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. నేరేడు పండులో విటమిన్ సి, బి12, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఖనిజాలు, ఫైబర్‌కు ఇవి మూలం. అందువల్ల ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబతున్నారు.

ఇవి కూడా చదవండి

నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • నేరేడు పండ్లు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నేరేడు పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.
  • నేరేడు పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ పండ్లలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలకు చాలా మంచివని నిపుణులు అంటున్నారు.
  • ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తహీనతను తొలగిస్తుంది.
  • నేరేడు పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫలితంగా, దీనిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినే అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజులో దాదాపు 200 గ్రాముల వరకు నేరేడు పండ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.