భారతదేశంలోని ఒడిశాలో పూరి ఒక చారిత్రక నగరం. పూరీ హిందువులకు పవిత్ర తీర్థయాత్ర స్థలం. సాంస్కృతిక సంపద, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నిధి పూరీ క్షేత్రం. ఈ క్షేత్రం పురాతన వారసత్వం, పవిత్ర ప్రాముఖ్యతతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నగరం ప్రధానంగా జగన్నాథ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీకృష్ణుని రూపమైన జగన్నాథునికి అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం.
జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే గొప్ప పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరి నగరంలో జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమం జూన్ లేదా జూలైలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ రథోత్సవంలో తన తోబుట్టువులైన బలరాముడు, సుభద్రలతో కలిసి కుర్చుని ఉంటారు. భారీ రథాలలో జగన్నాథుడు ఊరేగుతూ తన అత్త ఇంటికి చేరుకుంటాడు. ఈ సంవత్సరం ఈ పండుగను జూలై 7వ తేదీ, 2024 న జరుపుకుంటారు.
ఆధ్యాత్మిక ఉత్సవాలతో పాటు జగన్నాథ రథయాత్ర ఒరిస్సాలో శక్తివంతమైన సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే గొప్ప పాక అనుభవాన్ని అందిస్తుంది. ఈ శుభ సమయంలో పురీ క్షేత్రాన్ని సందర్శించాలని అనుకుంటే అక్కడ ఉన్న కొన్ని సాంప్రదాయ ఆహారాలు ఉన్నాయి. ఎవరైనా సరే అక్కడ ఉన్న సాంప్రదాయ ఆహారాన్ని ట్రై చేయవచ్చు.
చెన్నా పోడా: ఇది పన్నీర్, పంచదార, నెయ్యి , యాలకులు కలిపి తయారు చేసిన ప్రసిద్ధ ఒడియా డెజర్ట్. రథయాత్రలో పాల్గొనడానికి వెళ్ళేవారు ఈ చెన్నా పోడాను తప్పనిసరిగా ప్రయత్నించవలసిన డెజర్ట్.
మహాప్రసాదం: దీనిని చప్పన్ భోగ్ అని కూడా పిలుస్తారు. రథయాత్రలో జగన్నాథునికి సమర్పించే అత్యంత పవిత్రమైన ఆహారం. ఇది జగన్నాథ ఆలయంలో తయారు చేయబడిన విలాసవంతమైన విందు. భగవంతుడు తన భక్తులకు ఇచ్చే దైవిక ప్రసాదంగా పరిగణించబడుతుంది.
మితా దహీ: ఇది ఏలకులు లేదా కుంకుమపువ్వుతో కలిపిన తీపి పెరుగుతో చేసిన రుచికరమైన కూలింగ్ డెజర్ట్. ఇది సాంప్రదాయ ఒడియాకి చెందిన రుచికరమైన ఆహారం. దీనిని రథయాత్ర సమయంలో తరచుగా రిఫ్రెష్ అవ్వడానికి తీపి ఆహారంగా మితా దహీని వడ్డిస్తారు.
దాల్మా: ఇది వివిధ రకాల కూరగాయలతో వండిన సువాసన, పోషకమైన పప్పుతో తయారీ చేసే వంటకం దాల్మా. ఇది రథయాత్ర సమయంలో తరచుగా తిని ఆనందించే ఒడిషాకి చెందిన ఆరోగ్యకరమైన వంటకం.
ఉఖుదా: ఇది గోధుమ పిండి, పంచదార, ఏలకులతో తయారుచేసిన డీప్ ఫ్రైడ్ స్వీట్ స్నాక్. ఇది ఒక బంగారు బాహ్య క్రస్ట్ కలిగి ఉండే రుచికరమైన సాంప్రదాయ ఒడిస్స ఆహారం.
రసమలై: ఇది పాలలో నానబెట్టిన పన్నీరు, ఏలకులతో చేసిన దివ్యమైన డెజర్ట్. ఇది బలరాముడి ఆలయంలో ప్రసిద్ధి చెందిన డెజర్ట్.
ప్రతి వంటకం ఒడిశా పాక సంప్రదాయాల రుచిని అందించడమే కాదు గొప్ప పండుగ జగన్నాథుడు రధయాత్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పూరీ క్షేత్రానికి వెళ్ళే భక్తుడైనా లేదా పర్యాటకుడైనా ఒడిస్సా కు చెందిన సాంప్రదాయక ఆహారపదార్థాలను ప్రయత్నించండి. దీంతో రథయాత్ర మంచి అనుభవాన్ని , అనుభూతిని మిగులుస్తుంది.