Jack Fruit Uses: పనస పండు తింటే లాభాలా..? అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

అంతేకాదు.. చర్మానికి మంచి నిగారింపు తీసుకొస్తాయి. కేశసౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు వృద్ధికి బాగా ఉపయోగపడతాయి. ఎముకల బలానికి పనస తొనలు బెస్ట్ ఫుడ్‌ అంటున్నారు నిపుణులు. పనస తొనలు తినటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Jack Fruit Uses: పనస పండు తింటే లాభాలా..? అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Jackfruit

Updated on: Jul 19, 2025 | 8:24 PM

పనస తొనలతో డైజెషన్ బాగుంటుంది. శక్తిని పెంచే నేచురల్ ఫుడ్‌ పనస పండు. పనస వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఎ’,‘సి’ విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది.

పనస పండు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. అంతేకాదు.. చర్మానికి మంచి నిగారింపు తీసుకొస్తాయి. కేశసౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు వృద్ధికి బాగా ఉపయోగపడతాయి. ఎముకల బలానికి పనస తొనలు బెస్ట్ ఫుడ్‌ అంటున్నారు నిపుణులు. పనస తొనలు తినటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పనస పండులో సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. డయాబెటిక్‌ బాధితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌-C, పనసలో విటమిన్‌-A పుష్కలంగా ఉంటాయి. ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..