Hot Oil Massage: మీ తల వెంట్రుకలు రాలిపోతున్నాయా? గోరు వెచ్చని నూనెతో ఇలా చేశారంటే..

|

Nov 13, 2022 | 12:33 PM

గజిబిజి జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, అలసట.. వంటి వాటివల్ల మనస్సుతోపాటు, శరీరం కూడా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలు తల వెంట్రుకలు రాలిపోవడానికి కారణమవుతాయి. ఐతే గోరు వెచ్చని నూనెతో తల వెంట్రుకలను..

Hot Oil Massage: మీ తల వెంట్రుకలు రాలిపోతున్నాయా? గోరు వెచ్చని నూనెతో ఇలా చేశారంటే..
Hot Oil Massage
Follow us on

గజిబిజి జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, అలసట.. వంటి వాటివల్ల మనస్సుతోపాటు, శరీరం కూడా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలు తల వెంట్రుకలు రాలిపోవడానికి కారణమవుతాయి. ఐతే గోరు వెచ్చని నూనెతో తల వెంట్రుకలను మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నూనెతో తలపై మసాజ్ చేయడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది. జుట్టు ఊడటం ఆగిపోయి, ఆరోగ్యంగా వెంట్రుకలు పెరుగుతాయి. ఇదేం కొత్తపద్ధతికాదు. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసే విధానం మన పూర్వికుల కాలం నుంచే ఆచరణలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ‘హాట్ ఆయిల్ మసాజ్’ పేరుతో ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు.

ఎటువంటి జుట్టు ఉన్నవారైనా ‘హాట్ ఆయిల్ మసాజ్’ ఉపయోగించవచ్చు. హాట్ ఆయిల్‌తో తరచుగా మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదలకు కారణమవుతుంది. సాధారణంగా జుట్టు తేమను కోల్పోయినప్పుడు నిస్తేజంగా కనిపిస్తుంది. ఫలితంగా వెంట్రుకలు చిట్లి, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. ఇటువంటి జుట్టుకు నూనెతో రోజూ మసాజ్ చేస్తే జుట్టు మృదువుగా, బలంగా పెరుగుతుంది. మసాజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే.. తలపై నూనెతో మసాజ్‌ చేసే సమయంలో ఎక్కువ ఒత్తిడి ప్రయోగించకూడదు. స్కాల్ప్‌పై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది. ఇలా చేస్తే మరింత జుట్టు రాలడానికి అవకాశం ఉంటుంది. బదులుగా తలపై సున్నితంగా మసాజ్ చేస్తే, జుట్టు కణాలు బలపడతాయి. హెయిర్ ఫోలికల్స్‌కు పోషకాలను అందించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.

‘హాట్ ఆయిల్ మసాజ్’ అంటే గోరువెచ్చని నూనెతో తలపై మసాజ్ చేయడం. ఐతే నూనెను ఎక్కువగా వేడి చేయకూడదు. అధికవేడిగల నూనె శిరోజాలను దెబ్బతీస్తుంది. నూనెను కాస్త వేడి చేసి తలకు, జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే తల వెంట్రుకలకు పోషణ అందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.