Can We Drink Rain Water: వర్షం నీరు తాగొచ్చా..? అధ్యయనంలో షాకింగ్ విషయాలు

|

Jul 10, 2024 | 7:38 PM

దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసి తాగేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే.. వర్షం నీరు తాగొచ్చా..? వర్షం నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? పూర్వకాలంలో వర్షపు నీటిని సేకరించి అవసరమైనప్పుడు తాగేందుకు ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ప్రజలు అలా చేయడం గమనార్హం.

Can We Drink Rain Water: వర్షం నీరు తాగొచ్చా..? అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Rain Water
Follow us on

వర్షాకాలం మొదలైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల రాకతో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందుతున్నారు. చాలా చోట్ల వర్షం కారణంగా నీటి కొరత తిరిపోతుంది. దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసి తాగేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే.. వర్షం నీరు తాగొచ్చా..? వర్షం నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? పూర్వకాలంలో వర్షపు నీటిని సేకరించి అవసరమైనప్పుడు తాగేందుకు ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ప్రజలు అలా చేయడం గమనార్హం.

ఇంతకు ముందు కాలంలో కాలుష్యం తక్కువగా ఉండేది. అందుకే వాన నీరు పరిశుభ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలుష్యం బాగా పెరిగిపోయి వర్షపు నీరు కూడా కలుషితమవడం మొదలైంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, వర్షం నీటిలో హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడటానికి ఇదే కారణం.

వర్షపు నీటిలో సూక్ష్మ కణాలు:

ఇవి కూడా చదవండి

CDC ప్రకారం, కలుషిత వాతావరణం కారణంగా, వర్షం నీరు కూడా కలుషితమైంది. ఇప్పుడు దానిలో సూక్ష్మ కణాలు కనిపిస్తాయి. ఈ కణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది కాకుండా, కుళాయి నీటి కంటే వర్షం నీరు ఎక్కువ ఆల్కలీన్. అందువల్ల, దీన్ని తాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు.

వర్షపు నీరు కలుషితమవుతుంది. కాబట్టి దీనిని తాగడం మానుకోవాలి. అయితే, మీరు ఈ నీటిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. పాత్రలు, బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులకు వర్షపు నీటిని ఉపయోగించవచ్చు. ఇకపోతే, గర్భిణీలు, వృద్ధులు, శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షపు నీటిని అస్సలు తాగకూడదు. వర్షపు నీరు తాగడం వారి ఆరోగ్యానికి హానికరం.

నీటి కొరత ఉన్న ప్రదేశంలో నివసిస్తున్న వారు ఎక్కువగా వర్షపు నీటిపై ఆధారపడుతుంటారు. అలాంటి వారు వర్షపు నీటిని మరిగించి తాగొచ్చు. వర్షపు నీటిని మరిగించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..