Fruits at Night: రాత్రిపూట పండ్లను మాత్రమే తింటే జరిగేది ఇదే.. డోంట్ మిస్!

ప్రస్తుత కాలంలో మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరిగాక తగ్గించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవి పడితే అవి తినడం, సమయానికి తినకపోవడం కారణంగా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు అనేది పెరుగుతంది. ఈ బరువు తగ్గించుకోవడం..

Fruits at Night: రాత్రిపూట పండ్లను మాత్రమే తింటే జరిగేది ఇదే.. డోంట్ మిస్!
Fruits at night

Updated on: May 11, 2024 | 4:32 PM

ప్రస్తుత కాలంలో మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరిగాక తగ్గించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవి పడితే అవి తినడం, సమయానికి తినకపోవడం కారణంగా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు అనేది పెరుగుతంది. ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలా మంది డైటీషియన్ల సలహాలు, సూచనలు లేకుండా ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. బరువు తగ్గాలని చాలా మంది రాత్రి పూట పండ్లను తింటూ ఉంటారు. దీంతో త్వరగా బరువు తగ్గుతాం అనుకుంటారు. ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పండ్లలో అనేక పోషకాలు..

పండ్లను పగటి పూట తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. రాత్రి పూట అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిల్లో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలూ లభిస్తాయి. వీటిని సరైన విధంగా తీసుకుంటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. చాలా మంది త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని భోజనం మానేసి పండ్లు తింటారు.

జీర్ణ సమస్యలు..

ఇలా రాత్రి పూట పండ్లను తినడం వల్ల మీ ఆకలి అనేది తగ్గదు. మళ్లీ ఆకలి వేస్తుంది. మీరు రాత్రి పూట ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే చాలా రకాలు రెసిపీలు ఉన్నాయి. అలాగే పండ్లలో ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి పండ్లు ఎప్పుడూ పగటి పూట తినడం ఉత్తమం. రాత్రి పూట తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఇవి కూడా చదవండి

హెల్దీ ఆహారం..

సాయంత్రం అవ్వగానే శరీరంలో జీవక్రియ అనేది మందగిస్తుంది. ఆ సమయంలో పండు తింటే సరిగా జీర్ణం కావు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగొచ్చు. నిద్ర సమస్యలు కూడా వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి నిపుణులు అభిప్రాయం ప్రకారం పండ్లు అనేవి పగటి పూట తింటే మంచిది. రాత్రి పూట సాధ్యమైనంత వరకు మిల్లెట్స్, మిల్లెట్స్‌తో తయారు చేసే ఇడ్లీలు, రోటీలు, కిచిడి, ఆమ్లెట్ చపాతీ, అన్నం గుడ్డు కూర మొదలైనవి తీసుకుంటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..