Drinking Water While Standing: నిలబడి నీళ్లు తాగితే.. నిజంగానే కిడ్నీ, మోకాళ్లు దెబ్బతింటాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

| Edited By: Ravi Kiran

Jun 08, 2024 | 10:00 PM

మనలో చాలా మందికి నిలబడి నీళ్లు తాగడం అలవాటు. నిజానికి.. ఇలా నిలబడి నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని పలువురు అభిప్రాయ పడుతుంటారు. ఇందువల్ల జరిగే అనర్ధాలలో అందులో ఒకటి మోకాళ్లకు నష్టం చేకూరడం. అందుకే నీరు లేదా ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదని, కూర్చొని తాగాలని మన చుట్టూ ఉండే వాళ్లు నిరంతరం చెబుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగితే జీర్ణక్రియ చెడిపోయి ఆహారం జీర్ణం కావడం..

Drinking Water While Standing: నిలబడి నీళ్లు తాగితే.. నిజంగానే కిడ్నీ, మోకాళ్లు దెబ్బతింటాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Drinking Water While Standing
Follow us on

మనలో చాలా మందికి నిలబడి నీళ్లు తాగడం అలవాటు. నిజానికి.. ఇలా నిలబడి నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని పలువురు అభిప్రాయ పడుతుంటారు. ఇందువల్ల జరిగే అనర్ధాలలో అందులో ఒకటి మోకాళ్లకు నష్టం చేకూరడం. అందుకే నీరు లేదా ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదని, కూర్చొని తాగాలని మన చుట్టూ ఉండే వాళ్లు నిరంతరం చెబుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగితే జీర్ణక్రియ చెడిపోయి ఆహారం జీర్ణం కావడం కష్టంగా మారుతుందని, దీంతో మలబద్ధకం సమస్య తలెత్తుతుందనే అపోహ కూడా ఉంది. అంతేకాకుండా నిలబడి నీల్లు తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని కూడా ఎవరో ఒకరి నోటి వెంట మీరు వినే ఉంటారు. కాబట్టి నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదని, నిలబడి నీళ్ళు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. పైగా నిలబడి నీళ్లు తాగితే దాహం తీరదని, పదే పదే దాహం వేస్తోందనే నానుడి కూడా జనాల్లో ఉంది. అసలింతకీ వీటికి సంబంధించి ICMR ఏం చెబుతోందో ఇక్కడ తెలుసుకుందాం..

మన దేశంలోని అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ త్రాగునీటికి సంబంధించిన సమాచారాన్ని ఇటీవల నివేదిక రూపంలో విడుదల చేసింది. నిలబడి నీరు త్రాగడం వల్ల కాళ్ళకు, శరీరానికి హాని కలుగుతుందనడానికి ఎటువంటి రుజువు లేదు. ఇందుకు సంబంధించి ఖచ్చితమైన వాస్తవాలు, ఆధారాలు ఇంతవరకూ పరిశోధనల్లో బయటపడలేదు. అందువల్ల నిలబడి లేదా కూర్చొని ఎలా నీరు త్రాగినా ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదని ICMR చెబుతోంది.

నిపుణులు ఏమంటున్నారంటే..

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం హెచ్‌ఓడి ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. నిలబడి నీరు తాగడం వల్ల హాని కలుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించలేదు. తాజాగా ICMR కూడా నీటిని ఏ విధంగానైనా తాగవచ్చని ధృవీకరించింది. నిలబడి నీళ్లు తాగకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. ఈ సమస్యలన్నీ నిలబడి నీరు తాగడం వల్ల వస్తాయని, అలాగే నిలబడి నీళ్లు తాగడానికి, శరీరంలోని వ్యాధులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతున్నారు. అందువల్ల నిలబడి లేదా కూర్చొని నీరు ఏవిధంగా త్రాగినా ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు.

ఇవి కూడా చదవండి

రోజుకు ఎంత నీరు తాగాలి?

ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పక తాగాలి. వేసవిలో మాత్రం నీళ్లను ఇంకొంచెం అధికంగా తీసకుంటే ఇంకా మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.