AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీలు గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే పసిపాప నుంచి పండు ముసలి వరకు చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తమ చేతులను అందంగా అలంకరించుకోవాలని ఆశపడతారు. అయితే గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోవచ్చా? ఇది కడుపులోని బిడ్డకు సురక్షితమేనా? అనే విషయాలు తెలుసుకుందాం..

గర్భిణీలు గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Is Applying Henna Safe During PregnancyImage Credit source: pinrest
Krishna S
|

Updated on: Aug 04, 2026 | 1:37 PM

Share

భారతీయ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళలు అందంగా కనిపించడమే కాకుండా మనశ్శాంతి కోసం గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం సురక్షితమేనా? ఇది కడుపులోని బిడ్డపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఈ సందేహాలపై నిపుణులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలు తమ చేతులకు సహజమైన గోరింటాకు ఆకులను రుబ్బి పెట్టుకోవడం పూర్తిగా సురక్షితం. దీనివల్ల తల్లికి గానీ, కడుపులో పెరుగుతున్న శిశువుకు గానీ ఎలాంటి హానీ జరగదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

గోరింటాకు ఉపయోగాలు

శరీరానికి చల్లదనం: గర్భధారణ సమయంలో మహిళల శరీర ఉష్ణోగ్రత సహజంగానే పెరుగుతుంది. అరచేతులకు సహజమైన హెన్నా పెట్టుకోవడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి, చల్లదనం లభిస్తుంది.

ఒత్తిడి దూరం – మంచి నిద్ర: గోరింటాకులోని ఔషధ గుణాలు నరాలను ప్రశాంతపరిచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది గర్భిణులు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చర్మ కాంతి: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మానికి సహజమైన కాంతిని, అందాన్ని అందిస్తుంది.

రసాయన కోన్‌లతో ప్రాణాలకే ప్రమాదం..

సహజమైన గోరింటాకు సురక్షితమే అయినప్పటికీ, మార్కెట్‌లో లభించే తక్షణ ఎరుపుదనాన్ని ఇచ్చే కెమికల్ కోన్స్ లేదా బ్లాక్ హెన్నా జోలికి అసలు వెళ్లకూడదని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టంట్ కలర్ కోసం ఈ కెమికల్ కోన్లలో PPD వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతారు. ఇవి గర్భిణుల సున్నితమైన చర్మానికి తీవ్రమైన అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, విష ప్రభావాన్ని కలిగించే ప్రమాదం ఉంది.

గర్భిణులు పాటించాల్సిన సురక్షిత నియమాలు..

ఇంటి గోరింటాకే మేలు: చెట్టు నుంచి కోసిన ఆకులను ఇంట్లోనే శుభ్రంగా రుబ్బుకుని తయారుచేసిన హెన్నాను మాత్రమే ఉపయోగించాలి.

ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి: హెన్నా పెట్టుకునే ముందు కొద్ది మొత్తంలో చర్మానికి రాసి అలెర్జీ ఏమైనా వస్తుందో లేదో ప్యాచ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవడం మంచిది.

వైద్యుల సలహా: ఒకవేళ మీకు రక్తహీనత లేదా ఇతర తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే, గోరింటాకు పెట్టుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

(గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది వైద్య సలహా కాదు. గర్భధారణ సమయంలో ఆహారంలో గానీ, జీవనశైలిలో గానీ ఎలాంటి మార్పులు చేసుకున్నా సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మంచిది.)

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!