AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iron-Deficiency: రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో ఈ లోపం ఉన్నట్లే..

మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య రక్తహీనత. శరీరంలో ఐరన్ లోపిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. కానీ సమస్య ఏమిటంటే శరీరంలో ఇనుము లోపం వృద్ధి చెందుతుందని చాలామందికి తొలినాళ్లలో అర్థం కాదు..

Iron-Deficiency: రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో ఈ లోపం ఉన్నట్లే..
Iron Deficiency
Srilakshmi C
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 16, 2024 | 10:00 PM

Share

మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య రక్తహీనత. శరీరంలో ఐరన్ లోపిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. కానీ సమస్య ఏమిటంటే శరీరంలో ఇనుము లోపం వృద్ధి చెందుతుందని చాలామందికి తొలినాళ్లలో అర్థం కాదు. దీనిని పసిగట్టేందుకు కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. ఇవి రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

  • తగినంత నిద్ర తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే మీ శరీరంలో ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. విశ్రాంతి తీసుకున్న తర్వాత పని చేసే శక్తి మీకు లేకపోతే, జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ లోపం ఉంటే, తగినంత ఆక్సిజన్ కణాలకు చేరదు. ఫలితంగా అలసట వస్తుంది.
  • శరీరంలో ఐరన్‌ లోపం సంభవించినప్పుడు, మెదడుతో సహా శరీరంలోని వివిధ భాగాలలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. అప్పుడు తల తిరగడం, తలనొప్పి వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.
  • శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్ అందకపోతే ఛాతీ నొప్పి కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు లేనప్పటికీ తరచుగా ఛాతీ నొప్పి లేదా మీ ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లు ఉంటే ఐరన్‌ లోపం ఉన్నట్లే.
  • శరీరంలో ఐరన్ లోపం ఉంటే చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. చర్మం రంగు మారినట్లు కనిపిస్తోంది. చర్మ విస్తీర్ణం తగ్గుతుంది. అంతేకాకుండా వివిధ చర్మ సమస్యలు తలెత్తుతాయి.
  • గోళ్లు పెరగకముందే విరిగిపోతున్నాయా? అయితే మీకు ఐరన్‌ లోపం ఉన్నట్లే. శరీరంలో ఐరన్ లోపం వల్ల గోళ్లు బలహీనపడి విరిగిపోతాయి. గోర్లు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి.
  • శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి సప్లిమెంట్స్ మాత్రమే మార్గం కాదు. ఆహారం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. మాంసం, పాలకూర, వివిధ రకాల పప్పులు, రెడ్‌ మీట్‌, గుమ్మడి గింజలు, క్వినోవా, బ్రోకలీ, చేపలు తినడం ద్వారా శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై