Hyderabad to Andaman Tour: సమ్మర్ హాలీడేస్‌లో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే గమ్యస్థానాలలో అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉన్నాయి. ఎంతో అందమైన ఈ దీవులు దేశంలోనే అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి తెల్లని ఇసుక తిన్నెలతో కనిపించే బీచ్‌లు, సూర్యోదయ-సూర్యస్తమయ సమయంలో ప్రకృతి అందాలు పర్యాటకలు మనసులను దోచేసుకుంటాయి. మరి ఈ దీవుల అందాలను మీరూ చూసేయాలనుకుంటున్నారా..? అయితే అండమాన్ నికోబార్ దీవుల టూర్‌కి వెళ్లాలనుకునే మీలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సరికొత్త టూరేజ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకెెజ్ ద్వారా తక్కువ ఖర్చుతోనే మీరు అండమాన్ నికోబార్ దీవులలోని అందాలను చూసి రావచ్చు.
అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ అనే పేరుతో IRCTC ఈ టూర్ ప్యాకేజీ మే 26వ తేదీన అందుబాటులోకి వస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో మీరు పోర్ట్ బ్లెయిర్, సెల్యూలార్ జైల్, హావ్‌లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్, నీల్ ఐలాండ్ వంటి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టూర్.. 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఆ ఉదయమే 9.15 గంటలకు అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ముందుగా హోటల్ చెక్‌ఇన్ అయిన అనంతరం సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు వెళ‌్తారు. పోర్ట్ బ్లెయిర్‌లోనే ఆ రోజు రాత్రి భోజనం, బస ఉంటుంది.
Day 2 : రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి.. హావ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్ఇన్ అయిన తర్వాత రాధానగర్ బీచ్‌ని సందర్శిస్తారు. ఆ రాత్రి హావ్‌లాక్‌లోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కి అక్కడకు చేరుకోవాలి. ఆ తర్వాత హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ఐలాండ్‌లోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.
Day 4: నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత భరత్‌పూర్ బీచ్ సందర్శన ఉంటుంది. అనంతరం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం కావాలంటే షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో నాల్గో రోజు రాత్రి భోజనం, బస ఉంటుంది.
Day 5: ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి రాస్ ఐలాండ్ బయలుదేరతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
Day 6: ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంతరం పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉదయం 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజ్ ధర విషయానికొస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించడానికి రూ.55,780 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.43,170, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే రూ.42,885 చెల్లించాలని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పెద్దవారికే కాక 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలోనే మీ ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో స్టేయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..