Summer Tips: ఏసీ, ఫ్యాన్ అవసరం లేదు..ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు..! వేసవిలో కూడా కాశ్మీర్ లాంటి అనుభూతి గ్యారెంటీ?

|

Apr 10, 2024 | 8:43 AM

అయితే, మీ ఇంటిని సహజంగా చల్లబరచడానికి ACలు, కూలర్ల కంటే చౌకైన మార్గాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? అవును, పైగా అవి మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండామీ ఇంటిని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే.. అవే మన ఇంట్లో వేడి గాలిని చల్లబరుస్తాయి.

Summer Tips: ఏసీ, ఫ్యాన్ అవసరం లేదు..ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు..! వేసవిలో కూడా కాశ్మీర్ లాంటి అనుభూతి గ్యారెంటీ?
Summer Plants
Follow us on

ప్రస్తుతం సమ్మర్‌ సీజన్‌ నడుస్తోంది. ఉదయం 10గంటలకే సూర్యుడు ప్రతాపం చూపటం మొదలు పెడుతున్నాడు. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే ఒకటిన్నర నెలల వరకు సూర్యుని వేడి తానం నుండి ఉపశమనం కనిపించేలా లేదు. ఎండాకాలంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువ ఉక్కపోతగా ఉంటుంది. చెమటలు ఎక్కువగా పడుతాయి. ఇలాంటప్పుడు ఇంట్లో ఏసీ కూలర్‌, ఫ్యాన్‌ ఎక్కువగా వినియోగిస్తారు. అయితే, మీ ఇంటిని సహజంగా చల్లబరచడానికి ACలు, కూలర్ల కంటే చౌకైన మార్గాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? అవును, పైగా అవి మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండామీ ఇంటిని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే.. అవే మన ఇంట్లో వేడి గాలిని చల్లబరుస్తాయి.

Aloe Vera: కలబంద వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచడానికి, ఎలాంటి వడదెబ్బ లేదా టానింగ్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది. అందుచేత, కలబంద మొక్కను ఇంటి లోపల పెంచుకుంటే.. అది ఇండోర్ గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

Areca palm Plant : అత్యంత ప్రాచుర్యం పొందిన లివింగ్ రూమ్ మొక్కలలో అరేకా పామ్ ఒకటి. ఇది ఒక అలంకారమైన ఇండోర్ ప్లాంట్. ఇది అరెకా పామ్. చూడటానికి అందంగా ఉంటుంది. ఇది సహజ హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. అంటే ఇండోర్ గాలిని సహజంగా తేమగా ఉంచడానికి ఇది ఉత్తమమైనది. ఇంటిని లోపలి నుండి చల్లగా ఉంచడమే కాకుండా, బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి అనేక విషపదార్ధాలను గాలిలో తొలగించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

Chinese Evergreen: చైనీస్ ఎవెర్‌గ్రీన్ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పేరుకు తగినట్టుగానే చైనీస్ ఎవెర్‌గ్రీన్ మొక్క ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటూ చల్లదనాన్ని ఇస్తుంది. ఇంట్లో వేడిమి ఎక్కువగా అనిపిస్తే ఈ మొక్కలను పెంచుకోవాలి. వేడి గాలులను పీల్చుకొని వాతావరణాన్ని చల్లబరుస్తుంది.

Rubber Plant: రబ్బర్ ప్లాంట్‌.. ఈ మొక్కకు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఇది ఎక్కువ చల్లదనం ఇస్తుంది. ఈ మొక్క ఉండే నేల మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా చూసుకోవాలి. నీళ్లు తక్కువ మొతాదులో తరచూగా పోస్తుండాలి.

Spider Plant: స్పైడర్ ప్లాంట్ పేరు కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ ఈ మొక్కను మీరు ఈజీగా పెంచుకోవచ్చు. మీ మొక్కను మీరు ఎలా ఉంచినా హాయిగా పెరుగుతుంది. కచ్చితంగా ఇంట్లో వేడి తగ్గాలి అనుకునేవారు ఈ మొక్కను పెంచుకోవచ్చు.

Pothos or Devils Ivy: పోథోస్ లేదా డెవిల్స్ మొక్క మనీప్లాంట్ జాతికి చెందినది. దీని కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మొక్క నాటితే చాలు దానంతట అదే పెరుగుతుంది. ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా ఇంటిని చల్లగా ఉండేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…