చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఎన్నెన్నో ప్రదేశాలను అన్వేషించాలనుకుంటారు. అయితే ప్రతిసారీ ఒక్క ప్రదేశాన్నే సందర్శించలేరు. అటువంటి పరిస్థితిలో కొత్త కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలని.. అక్కడకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడపాలని కోరుకుంటారు. ఈ రోజు మనం బెంగుళూరు చుట్టూ ఉన్న కొన్ని అత్యుత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఎవరైనా బెంగళూరుకి వెళ్ళాలనుకున్నా.. బెంగళూరు సమీపంలో నివసిస్తుంటే.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రెండు మూడు రోజుల పాటు ఈ ప్రదేశాలకు విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు. ముఖ్యంగా మీరు పర్వతాలు, అడవులకు వెళ్లాలని భావిస్తే ఇక్కడకు వెళ్లి వారాంతాన్ని గడపవచ్చు. ఈ నేపధ్యంలో బెంగళూరు సమీపంలోని అందమైన చూడదగిన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
స్కందగిరి: బెంగుళూరుకు సమీపంలోని స్కందగిరి సమీపంలో కొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్‌ను ఆస్వాదించవచ్చు. చాలా మంది పర్యాటకులు ఒకటి నుంచి రెండు రోజులు ఎంజాయ్ చేయాలంటే పిక్నిక్ కోసం ఈ ప్రదేశాలని వెళ్తారు. ఈ ప్రదేశాన్ని కలవర దుర్గ లేదా కలవర బెట్ట అని కూడా అంటారు. ఈ ప్రదేశం నంది కొండల చుట్టూ 1450 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మీరు కొండ రహదారులపై శిధిలమైన కోటలను చూడవచ్చు. అనేక భయానక కథలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయి.
తట్టేకెరె సరస్సు: బెంగుళూరుకు 40 కి.మీ దూరంలో రామనగర జిల్లా కనకపుర తాలూకాలోని తట్టేకెరె గ్రామం. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని వారు తట్టేకెరె సరస్సును సందర్శించవచ్చు. ఎందుకంటే ఇది నగర శివార్లలో ఉంది. నగరానికి దూరంగా ఉండే ఈ సరస్సు ప్రాతంలో చాలా శాంతిని పొందుతారు. చుట్టూ పచ్చదనంతో కూడిన సరస్సు వాతావరణం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ప్రకృతి ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి ఈ ప్రదేశం ఉత్తమమైనది.
నంది కొండలు: నంది హిల్స్ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో గంగా రాజవంశంచే నిర్మించబడిన పురాతన హిల్ స్టేషన్. మీరు మీ స్నేహితులతో కలిసి వెళ్ళడానికి ఇక్కడ ప్రణాళికలు రూపొందించవచ్చు. ఇక్కడ పర్వతాలు, పచ్చదనంతో ఉన్న అందమైన దృశ్యాలను చూడవచ్చు. నంది హిల్స్ సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల ఇక్కడ నుంచి చాలా అందమైన దృశ్యాలను చూడవచ్చు. నంది కొండలను నంది దుర్గ లేదా నంది కోట అని కూడా అంటారు. ఇది మూడు నదుల సంగమం.
కనకపుర: బెంగుళూరు నుండి 63 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నైట్ ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉంది. నైట్ ట్రెక్కింగ్ ను ఆస్వాధించవచ్చు. దక్షిణ భారతదేశంలోని అన్ని ట్రెక్కింగ్ ప్రదేశాలలో దీని పేరు అగ్రస్థానంలో ఉంది. ఎవరైనా నిశ్శబ్ద ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే కుటుంబం లేదా స్నేహితులతో కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. ఇక్కడ మీరు రాత్రి సమయంలో నక్షత్రాల ఆకాశం క్రింద నిద్రపోతూ చీకటిలో చిరుదివ్వేలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది.
మరిన్నిలైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..