Travel Bloggers: ఇన్‌స్టాలో ఫాలోవర్స్ పెరగాలా..? ఆ ప్రదేశాల్లో బ్లాగింగ్ చేస్తే ఫాలోవర్స్ పెరగడం ఖాయం

|

Jul 12, 2024 | 3:38 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చిత్ర విచిత్రాలన్నీ చేస్తున్నారు. ఆయా ప్లాట్‌ఫారమ్స్‌లో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? తమ పోస్ట్‌కు ఎన్ని లైక్స్ వచ్చాయి? అనే విషయాన్ని యూత్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఎన్ని పనులు చేయాలో? అన్ని చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ట్రావెల్ బ్లాగింగ్ వీడియోలు చేసే వారికి అధికంగా ఫాలోవర్స్ వస్తున్నారని ట్రావెల్ వీడియోలు చేస్తున్నారు.

Travel Bloggers: ఇన్‌స్టాలో ఫాలోవర్స్ పెరగాలా..? ఆ ప్రదేశాల్లో బ్లాగింగ్ చేస్తే ఫాలోవర్స్ పెరగడం ఖాయం
Tourism
Image Credit source: google
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూ ట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చిత్ర విచిత్రాలన్నీ చేస్తున్నారు. ఆయా ప్లాట్‌ఫారమ్స్‌లో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? తమ పోస్ట్‌కు ఎన్ని లైక్స్ వచ్చాయి? అనే విషయాన్ని యూత్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఎన్ని పనులు చేయాలో? అన్ని చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ట్రావెల్ బ్లాగింగ్ వీడియోలు చేసే వారికి అధికంగా ఫాలోవర్స్ వస్తున్నారని ట్రావెల్ వీడియోలు చేస్తున్నారు. దేశంలోని ప్రతి మూలకు తిరుగుతూ తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు భారతదేశంలో ఉన్న  ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

కొడైకెనాల్, తమిళనాడు

కొడైకెనాల్ వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. అందమైన జలపాతాల హొయలను మీరు క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మిలియన్ల వ్యూస్‌తో పాటు ఫాలోవర్స్ కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నారు. కొడైకెనాల్‌లో మూడు పగళ్లు, రెండు రాత్రులు ఉండి ట్రావెల్ బ్లాగింగ్ చేయవచ్చు. ప్రయాణ ఖర్చు దాదాపు రూ.10 వేలు అవుతుంది.

షిల్లాంగ్, మేఘాలయ

వర్షాకాలంలో షిల్లాంగ్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడి జలపాతాలు, పర్వతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. మీరు గౌహతి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు మీ ఫాలోవర్స్‌కు మంచి చిత్రాలు, వీడియోలు అందించాలనుకుంటే కచ్చితంగా ఇక్కడ సందర్శించాలి.

ఇవి కూడా చదవండి

లోనావాలా

ముంబై-పూణే మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో ట్రావెల్ బ్లాగర్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో మీ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. స్నేహితులతో కలిసి 2 రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేస్తే ఇక్కడి వాతావారణం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

రాణిఖేత్, ఉత్తరాఖండ్

‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ సమీపంలో ఉన్న రాణిఖేత్ వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. ఢిల్లీ నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు కేవలం రూ. 10,000తో మీ 2 రోజుల పర్యటనను పూర్తి చేసుకోవచ్చు.

అరకు

వర్షాకాలంలో సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. వర్షాకాలంలో ఈ ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. విశాఖపట్నం నుంచి ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. మీరు కిరండూల్ ప్యాసింజర్ రైలు ద్వారా కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..