పూల్ మఖానాతో మస్త్‌ మస్త్‌ బెనిఫిట్స్‌.. రోజూ గుప్పెడు తింటే ఈ సమస్యలన్నీ దూరం..!

|

Jan 04, 2025 | 1:40 PM

మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. తేలికగా బరువు తగ్గాలనుకునే వారు ఫూల్‌ మఖానాను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయిన నిపుణులు చెబుతున్నారు.

పూల్ మఖానాతో మస్త్‌ మస్త్‌ బెనిఫిట్స్‌.. రోజూ గుప్పెడు తింటే ఈ సమస్యలన్నీ దూరం..!
Makhana
Follow us on

బాదం, జీడిపప్పు వంటి ఇతర డ్రై ఫ్రూట్స్‌తో సమాన పోషకాలు కలిగిన ఒక అద్భుతమైన ఆహార పదార్థం ఫూల్‌ మఖానా. ఇందులో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం.. నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సలో తామర గింజలను ఉపయోగిస్తారు. ఎముకల ఆరోగ్యానికి మఖానాలోని కాల్షియం మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఫూల్‌ మఖానా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం శరీరంలోని జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం. ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల సంకోచాలు, నరాల పనితీరు అన్నింటికీ మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ నుండి కాపాడతాయి.

సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు ఉపయోగిస్తారు. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. తేలికగా బరువు తగ్గాలనుకునే వారు ఫూల్‌ మఖానాను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..మఖానాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..