నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల వెల్లుల్లిలో యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘ కాలిక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. రక్తపోటును నియంత్రించడంలో నల్ల వెల్లుల్లి మంచి పాత్ర పోషిస్తుంది. కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రించి గుండె సంబంధిత రోగాల బారి నుంచి కాపాడుతుంది.

నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Black Garlic

Updated on: Apr 29, 2025 | 1:53 PM

నల్లు వెల్లుల్లిని ఎప్పుడైనా చూశారా..? సాధారణ వెల్లుల్లిని ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద 15 రోజులు పులియబెడితే నల్ల వెల్లుల్లి తయారవుతుంది. తెల్ల వెల్లుల్లితో పోల్చుకుంటే ఇది తక్కువ ఘాటుగా ఉంటుంది. కానీ, నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల వెల్లుల్లి యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల వెల్లుల్లిలో యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘ కాలిక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. రక్తపోటును నియంత్రించడంలో నల్ల వెల్లుల్లి మంచి పాత్ర పోషిస్తుంది. కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రించి గుండె సంబంధిత రోగాల బారి నుంచి కాపాడుతుంది.

రోజూ పరగడుపున నల్ల వెల్లుల్లి తింటే బ్లడ్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. నల్ల వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే సమ్మేళనం జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వులు, క్యాలరీలు కరుగుతాయి. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. నల్లవెల్లుల్లిలోని కొన్ని సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దరి చేరకుండా ఉంటాయి.

నల్ల వెల్లుల్లిలోని ప్రీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. నల్ల వెల్లుల్లి రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే కేన్సర్ కణాల వృద్ధిని కూడా అరికడుతుంది. నల్ల వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల దెబ్బతినడం నుండి రక్షిస్తాయి. తద్వారా అల్జీమర్స్, డిమెన్షియా వంటి వయసు సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..