Late Night Eating: అర్ధరాత్రి తినే అలవాటు ఉందా.. యోగా, వ్యాయామం కూడా మిమ్మల్ని కాపాడలేవు అని మీకు తెలుసా..!

|

May 21, 2024 | 5:05 PM

కొంతమందికి రాంగ్ టైంలో అంటే అర్ధరాత్రి లో కూడా ఆకలి వేస్తుంది. అయితే ఇలా రాత్రి సమయంలో ఆకలి వేసిన వెంటనే చాలా మంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టి నచ్చింది తినేస్తున్నారు. అయితే ఇలా వేళకాని వేళలో ఆహారం తిన్నా, ఆలస్యంగా తిన్నా, లేదా అర్ధరాత్రి ఆహారం తిన్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట. ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు, ఆలస్యంగా భోజనం చేసేవారు తప్పని సరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అర్ధరాత్రి తినే అలవాటు ఉన్నవారు రకరకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఎటువంటి వ్యాధుల బారిన పడతారో ఈ రోజు తెలుసుకుందాం..

Late Night Eating: అర్ధరాత్రి తినే అలవాటు ఉందా.. యోగా, వ్యాయామం కూడా మిమ్మల్ని కాపాడలేవు అని మీకు తెలుసా..!
Late Night Eating
Follow us on

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం చాలా హడావిడిగా సాగుతుంది. నిద్ర లేచింది మొదలు తినడం, తాగడం, నిద్ర పోయే వరకూ ఇలా రోజువారీ దిన చర్యల్లో మార్పులు వచ్చాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం ఇలా అన్నిటిలోనూ మార్పులు వచ్చాయి. అంతేకాదు కొంతమందికి రాంగ్ టైంలో అంటే అర్ధరాత్రి లో కూడా ఆకలి వేస్తుంది. అయితే ఇలా రాత్రి సమయంలో ఆకలి వేసిన వెంటనే చాలా మంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టి నచ్చింది తినేస్తున్నారు. అయితే ఇలా వేళకాని వేళలో ఆహారం తిన్నా, ఆలస్యంగా తిన్నా, లేదా అర్ధరాత్రి ఆహారం తిన్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట. ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు, ఆలస్యంగా భోజనం చేసేవారు తప్పని సరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అర్ధరాత్రి తినే అలవాటు ఉన్నవారు రకరకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఎటువంటి వ్యాధుల బారిన పడతారో ఈ రోజు తెలుసుకుందాం..

ఊబకాయం
అర్ధరాత్రి ఆహారం తినాలనే కోరిక ఉన్నా.. రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉన్నా త్వరగా ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువట. ఈ అలవాటు ఉన్నవారికి వ్యాయామం, డైట్ వంటివి కూడా ఉపయోగపడవు. బరువు పెరుగుతూనే ఉంటారు. ఆలస్యంగా రాత్రి సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. కనుక వీలైనంత వరకు అర్ధరాత్రి తినే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. .

పేలవమైన జీర్ణక్రియ
అర్థరాత్రి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు లేదా పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను అందించదు. ఈ అలవాటు ఉన్నవారు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో తరచుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వద్దనుకుంటే అర్ధరాత్రి తినే ఆహారపు అలవాటుకు గుడ్ బై చెప్పండి. అంతేకాదు తిన్న తర్వాత నడవండి.

ఇవి కూడా చదవండి

రక్తపోటు సమస్య
ఆలస్యంగా తినడం వల్ల కూడా రక్తపోటు పెరగడం, తగ్గడం జరుగుతుంది. అంతేకాదు ఈ అలవాటు మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ప్రతిరోజూ రాత్రి భోజనం ఆలస్యంగా తింటే, గుండెపై ఈ ఆహారపు అలవాటుతో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని.. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలసట, బద్ధకం
ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు తినే ఆహారం పోషకాహారం అయినా అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అవసరమైన పోషకాలు శరీరానికి అందవు. దీని కారణంగా తక్కువ శక్తి లభిస్తుంది.

Note: ఈ వ్యాసంలో అందించిన సలహాలు, సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే.. వృత్తిపరమైన వైద్య సలహాగా భావించరాదు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది.