Sleeping Tips: మంచి నిద్ర పట్టాలా.. ఈ మొక్కలు బెడ్‌రూమ్‌లో ఉండాల్సిందే!

|

Apr 06, 2024 | 7:23 PM

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో నిద్రలేమి సమస్యలు కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, వర్క్ ప్రెజర్ వంటి వాటి వల్ల కూడా నిద్ర సరిగ్గా పడట్టదు. సరైన విధంగా నిద్ర లేకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండె పోటు వంటివి..

Sleeping Tips: మంచి నిద్ర పట్టాలా.. ఈ మొక్కలు బెడ్‌రూమ్‌లో ఉండాల్సిందే!
Plants For Sleep
Follow us on

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో నిద్రలేమి సమస్యలు కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, వర్క్ ప్రెజర్ వంటి వాటి వల్ల కూడా నిద్ర సరిగ్గా పడట్టదు. సరైన విధంగా నిద్ర లేకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండె పోటు వంటివి రావచ్చు. ఈ సమస్య నుంచి బటయ పడేందుకు చాలా మంది వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు. అయితే.. బెడ్‌రూమ్‌‌లో కొన్ని సహజసిద్ధమైన మొక్కల్ని పెట్టుకుంటే నిద్ర లేమి సమస్యల నుంచి బయట పడొచ్చట. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్నేక్ ప్లాంట్:

స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే.. వాస్తు దోషాలే కాకుండా.. నిద్రలేమి సమస్యలను కూడా కట్టడి చేయవచ్చు. స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీన్ని బెడ్ రూమ్‌లో పెట్టుకుంటే.. ప్రశాంతమైన గాలి ఉంటుంది. దీంతో మంచి నిద్ర పట్టేందుకు స్నేక్ ప్లాంట్ సహాయం చేస్తుంది.

అలోవెరా:

అలోవెరా మొక్కను కూడా బెడ్ రూమ్‌లో పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది. కల బంద మొక్క నుంచి కూడా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇంది గాలిని శుద్ధి చేస్తుంది. కాబట్టి నిద్ర పట్టేందుకు సహాయ పడుతుంది. కలబందలో అనేక మెడిసిన్ గుణాలు కూడా ఉంటాయి. కలబంద ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడంలో చక్కగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జాస్మిన్:

జాస్మిన్ మొక్క కూడా మంచి నిద్ర ఉపక్రమించడానికి ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. ఈ మొక్క ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. వీటి నుంచి మంచి సువాసన వస్తుంది. ఆ అరోమా వల్ల చక్కగా నిద్ర పడుతుంది.

ఇంగ్లీష్ ఐవీ:

ఇంగ్లీష్ ఐవీ మొక్క అనేది ఇండోర్ ప్లాంట్. దీన్ని కూడా చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు. ఈ మొక్క నుంచి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ మొక్క పరిసరాల్లో ఉండే విషవాయువులను పీల్చి.. ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ మొక్క బెడ్ రూమ్‌లో పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..