Spinach and Tomato: పాలకూర – టమాటా కలిపి తింటే ఇన్ని సమస్యలా..

అన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ అందరికీ పడవు. అలాంటి వాటిల్లో టమాటా - పాలకూర కాంబినేషన్ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ ఫుడ్ అందరికీ పడాలని లేదు. కొంత మందికి అనేక రకాల సమస్యలను తీసుకొస్తుంది..

Spinach and Tomato: పాలకూర - టమాటా కలిపి తింటే ఇన్ని సమస్యలా..
Spinach And Tomato

Updated on: Dec 10, 2024 | 1:11 PM

పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ పాల కూర తీసుకున్నా ఎన్నో పోషకాలు అందుతాయి. పాలకూర ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి. అదే విధంగా టమాటా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా జుట్టు, చర్మ సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటి కాంబినేషన్‌తో మాత్రం సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమాటా, పాలకూర కలిపి వండితే అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని చెబుతున్నారు. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు. అలా వీటిల్లో ఇది కూడా ఒకటి. ఇవి రెండూ విభిన్న రసాయనిక సమ్మేళనాలను రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఈ రెండూ కలిపి తింటే సమస్యలు తప్పవు. మరి పాలకూర – టమాటా కలిపి తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీల సమస్య:

పాలకూర, టమాట కలిపి తినడం వల్ల కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుందట. వీటిని కలిపి తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడానికి అవకాశం ఉంది. అలాగే మూత్ర పిండాల సమస్యలతో బాధ పడేవారు ఈ కాంబినేషన్ తినకపోవడమే మంచిది. వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

ఖనిజాల సమతుల్యం:

పాలకూర, టమాటాలో ఖనిజాలు అనేవి అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని కలిపి తింటే.. త్వరగా జీర్ణం అయ్యే శక్తి ఉండదు. అంతే కాకుండా కొన్ని పోషకాలు శోషణను తగ్గించే అవకాశం ఉంది. దీని వల్ల రక్త హీనత సమస్య, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

ఇవి కూడా చదవండి

అసిడిటీ సమస్య:

టమాటా, పాలకూర తినడం వల్ల అసిడిటీ సమస్యలు ఏర్పడవచ్చు. ఎందుకంటే వీటిల్లో గ్యాస్‌ని ప్రేరేపించే లక్షణాలు ఉంటాయి. ఈ రెండింటిని త్వరగా జీర్ణం చేసే శక్తి పొట్టకు ఉండదు. దీని కారణంగా అసిడిటీ సమస్యల తలెత్తవచ్చు. ఇది మూత్ర పిండాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆక్సలేట్ సమస్య కూడా ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ అందరికీ పడవు. కాబట్టి ఎవరైతే తినాలి అనుకుంటున్నారో.. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..