Beauty Tips: రాత్రి పడుకునే ముందు ఈ నూనె ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా ఉండాలని, చర్మం చాలా బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు.

Beauty Tips: రాత్రి పడుకునే ముందు ఈ నూనె ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Beauty Tips

Edited By:

Updated on: Jun 06, 2023 | 10:00 AM

ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా ఉండాలని, చర్మం చాలా బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ ఇందులోని రసాయనాల వల్ల చర్మానికి నష్టం ఎక్కువవుతుంది. అయితే ఇంట్లోనే లభించే వస్తువులతో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. చాలా మందికి ముఖంపై మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు వేధిస్తుంటాయి. వాటిని నివారించేందుకు ఎన్నో క్రీములు వాడుతుంటారు. వాటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంట్లోనే లభించే ఈ నూనెతో మీ ముఖంపై మొటిమలకు చెక్ పెట్టొచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

ఆవాల నూనె:

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, చర్మాన్ని సహజంగా తేమగా ఉంచడానికి సహజ నివారణలను ఉపయోగించడం మంచిది. ఆవాల నూనె అటువంటి సహజ నివారణలలో ఒకటి. ఆవాల నూనెను అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉండటమే కాకుండా అనేక ముఖం, చర్మ సమస్యలను నయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలను వదిలించుకోవడానికి:

ఆవాల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటతో.. ఇది చర్మంపై హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి, పోరాడటానికి సహాయపడుతుంది. ఇది చర్మ గాయాలను త్వరగా నయం చేస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి:

మస్టర్డ్ ఆయిల్ ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది చర్మంలో తేమను లాక్ చేసి పోషణను అందించడంలో సహాయపడుతుంది. పొడి చర్మం సమస్యను నయం చేయడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

చర్మానికి మెరుపును ఇస్తుంది:

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆవాల నూనెను ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది టానింగ్, పిగ్మెంటేషన్, ముఖ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ముఖాన్ని మెరిసేలా, తాజాగా ఉంచండంలో సహాయపడుతుంది.

డెడ్ స్కిన్ తొలగిస్తుంది:

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఆవాల నూనె ముఖంపై మృత చర్మ కణాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.

చర్మాన్ని బిగుతుగా చేస్తుంది:

కొంతమంది వయసు పెరిగే కొద్దీ ముఖ చర్మాన్ని కోల్పోతారు. మస్టర్డ్ ఆయిల్ ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై ఉండే చక్కటి గీతలు, ముడతలు, రంధ్రాలను కుదించి మిమ్మల్ని మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం…