Life Style: ఈ సృష్టిలో కలకలాం కలిసి ఉండాల్సిన ఒకే ఒక బంధం భార్య భర్త. జీవితంలో తల్లిదండ్రులు కొద్ది సమయం వరకే మనతో ఉంటారు, ఆ తర్వాత పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఉంటారు. కానీ జీవితాంతం తోడుగా నిలిచేది భార్య భర్తలు ఇద్దరే. మరి అలాంటి బంధం ఎంత అన్యోన్యంగా ఉంటే జీవితం అంత అందంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రతీ రిలేషన్‌లో గొడవలు ఉన్నట్లే భార్య, భర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు పరిపాటే. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే జీవితం సాఫీగా సాగిపోతుంది. మరీ ముఖ్యంగా దాంపత్య జీవితం సాఫీగా ఉండాలంటే భర్తలు కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే..
* వేరే వారి ముందు మీ భార్యను ఎట్టి పరిస్థితుల్లో అగౌరవపరచకండి. దానిని వారు తట్టుకోలేరు. మీరిద్దరి మధ్యలో ఎన్ని జరిగినా పట్టించుకోని వారు ఇతరుల ముందు తమ గౌరవం కోల్పోతే మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
* మహిళలు భర్త, ఇల్లే ప్రపంచంగా జీవిస్తుంటారు. కాబట్టి అలాంటి వారు ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకోకుండా ప్రశాంతంగా వారి మాటను వినండి. భార్యలకు మీరిచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే.
* భర్తల నుంచి భార్యలు సర్‌ప్రైజ్‌లు కోరుకోవడం చాలా సాధారణమైన విషయం. అలా అని భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రేమతో వారికి ఓ చిన్న చాక్లెట్ ఇచ్చినా ఫిదా అవుతారు. తనకోసం మీరు ఆలోచిస్తున్నారన్న ఆలోచనే వారికి సంతోషాన్ని ఇస్తుంది.
* ఇక కొందరు భర్తలు పని బిజీలో పడిపోయి భార్యల గురించి పట్టించుకోరు. అలా కాకుండా ఏదో ఒక సమయంలో ఒక కాల్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా.? లాంటి ప్రశ్నలు అడగాలి. అలా చేస్తే మీ మధ్య బంధం బలంగా మారుతుంది.
* ఇక ఏ బంధమైనా కలకాలం కలిసి ఉండాలంటే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. నువ్వు నాకు చెప్పేంత దానివా.? అన్న మాటలను కట్టిపెట్టి భార్యల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఇలా చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా భార్య, భర్తలు ఎలాంటి గొడవలు పడకుండా కలకాలం కలిసి ఉంటారు. ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమైనేవని అనుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడే వందేళ్ల జీవితం సంతోషంగా గడుస్తుంది.
Also Read: Samyuktha Menon: సొగసుల సాగరంలో మత్స్యకన్య ఈ మలయాళీ సోయగం.. సంయుక్త మీనన్
David Warner: ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు ఉండబోతుంది.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Naga Shaurya: ప్రతి ఇంట్లో చూసే కథే మా వరుడు కావలెను సినిమా: హీరో నాగశౌర్య