How to wash jeans: జీన్స్‌ ప్యాంట్లు ఎలా ఉతుకుతున్నారు? పొరపాటున కూడా ఇలా చేయకండి.. త్వరగా పాడైపోతాయ్‌

|

Mar 05, 2024 | 9:09 PM

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చీరలు, కుర్తీల కంటే జీన్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లాలన్నా జీన్స్ చాలా సౌకర్యంగా ఉంటుంది. జీన్స్‌తో టాప్, కుర్తీ సులభంగా ధరించవచ్చు. మునుపటి రోజుల్లో జీన్స్ చాలా మందంగా ఉండేది. ఎన్నేళ్లు గడిచినా చిరిగిపోకుండా ఉండేవి. పైగా మందంగా ఉండటం వల్ల అసౌకర్యంగా అనిపించేవి. కానీ.. నేటి రోజుల్లో వస్తున్న జీన్స్‌ క్లాత్ చాలా పలుచగా ఉంటోంది. దీంతో జీన్స్‌లో కూడా..

How to wash jeans: జీన్స్‌ ప్యాంట్లు ఎలా ఉతుకుతున్నారు? పొరపాటున కూడా ఇలా చేయకండి.. త్వరగా పాడైపోతాయ్‌
How To Wash Jeans
Follow us on

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చీరలు, కుర్తీల కంటే జీన్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లాలన్నా జీన్స్ చాలా సౌకర్యంగా ఉంటుంది. జీన్స్‌తో టాప్, కుర్తీ సులభంగా ధరించవచ్చు. మునుపటి రోజుల్లో జీన్స్ చాలా మందంగా ఉండేది. ఎన్నేళ్లు గడిచినా చిరిగిపోకుండా ఉండేవి. పైగా మందంగా ఉండటం వల్ల అసౌకర్యంగా అనిపించేవి. కానీ.. నేటి రోజుల్లో వస్తున్న జీన్స్‌ క్లాత్ చాలా పలుచగా ఉంటోంది. దీంతో జీన్స్‌లో కూడా చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. జీన్స్ ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

లేదంటే రంగు వెలసిపోయి, త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జీన్స్‌ను శుభ్రం చేసేటప్పుడు ఈ కింది చిట్కాలను తప్పక గుర్తుంచుకోవాలి. ప్యాంటు ఎంత క్లీన్‌గా ఉంటే అంత ఎక్కువ కాలం ఉంటాయి. సాధారణంగా జీన్స్‌కు ఫాబ్రిక్ క్లాత్‌ వినియోగిస్తుంటారు. వీటిని శుభ్రం చేసేందుకు మార్కెట్లో అనేక రకాల డిటర్జెంట్లు అందుబాటులో ఉన్నా.. వాటిల్లో మన్నిక కలిగిన వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. ఆల్కలీ ఎక్కువగా ఉండే సబ్బులు ఎక్కువగా వాడితే బట్టలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి తక్కువ ఆల్కలీన్ డిటర్జెంట్‌ని మాత్రమే జీన్స్‌ శుభ్రం చేసేందుకు ఉపయోగించాలి.

పైభాగాన్ని శుభ్రం చేయడమే కాదు, జీన్స్ లోపలి భాగాన్ని కూడా శుభ్రం చేయాలి. అంటే జీన్స్‌ను తలక్రిందులుగా చేయాలి. శుభ్రం చేసే సమయంలో తలక్రిందులుగా చేస్తే, రంగు మసకబారదు. జీన్స్‌ని నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేయకూడదు. అంతకంటే ముందు సబ్బులో నానబెట్టి.. బాగా రుద్ది తర్వాత వాషింగ్ మెషీన్‌లో వేయాలి. డ్రైయర్‌లో ఆరబెట్టి, నీడలో ఆరవెయ్యాలి. ఇలా చేస్తే జీన్స్ ఉతికినా రంగు పోదు. ఇలా చేస్తే చాలా కాలం పాటు జీన్స్‌ మన్నికగా ఉంటుంది. జీన్స్‌పై మరక ఏదైనా ఉంటే ముందుగా ఆ మరకను తొలగించాలి. లేకపోతే మరక అస్సలు తొలగించబడదు. జీన్స్ ఫ్యాబ్రిక్ చిక్కగా ఉంటుంది కాబట్టి ఈరోజు వేసుకుంటే రేపు ఉతకాల్సిన అవసరం ఉండదు. కనీసం 10-12 రోజుల తర్వాత దానిని ఉతకాలి. అతిగా ఉతికితే జీన్స్ త్వరగా పాడవుతుంది. జీన్స్‌ని ఎల్లప్పుడూ గదిలో ఉన్న హ్యాంగర్‌పై వేలాడదీయాలి. ఇలా చేస్తే ప్యాంటు ఎక్కువ కాలం ఉంటుంది. మడిచి ఉంచితే బట్టలు త్వరగా ముడుచుకుపోతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ సంబంధిత కథనాల కోసం క్లిసం క్లిక్‌ చేయండి.