Malai Store Tips: అచ్చం అమ్మమ్మ చేతి వంట మాదిరి.. వెన్నతో కమ్మని నెయ్యి ఇంట్లోనే ఇలా చేసేయండి!

ఒకప్పుడు ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ పాలకు తోడేసి.. ఉదయాన్నే చిలికి కమ్మని వెన్నను తీసి నిల్వచేసేవారు. ఎక్కువ మొత్తంలో పోగయ్యాక.. ఇందులో కాసిన్ని తమలపాకు రెబ్బలు, మెంతులు, జీలకర్ర వేసి.. స్టౌపై మరిగిస్తే సువాసనలు వెదజల్లే నెయ్యి తయారవుతుంది. ఇలా తయారు చేసిన నెయ్యి ఏడాదంతా నిల్వ ఉంటుంది. అయితే ఇలా రోజూ తీసిని వెన్నను నిల్వ చేయడం దాదాపు ప్రతి ఇంట్లో చూసి ఉంటారు..

Malai Store Tips: అచ్చం అమ్మమ్మ చేతి వంట మాదిరి.. వెన్నతో కమ్మని నెయ్యి ఇంట్లోనే ఇలా చేసేయండి!
How To Store Malai

Updated on: Sep 02, 2025 | 7:55 PM

పెరుగుతో తయారు చేసిన వెన్నతో నెయ్యి మాత్రమేకాకుండా రుచికరమైన వంటకాలు తయారు చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. దీనిని సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా చెడిపోతుంది. నెయ్యి నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. వెన్నను ఎంతకాలం నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది? ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో భద్రంగా నిల్వ ఉంచవచ్చో? అసలు వెన్నను నిల్వ చేసే పద్దతి ఏమిటో? చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతిరోజూ పెరుగు చేశాక.. పైన ఉండే క్రీమ్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో సేకరించి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. సాధారణంగా ఈ క్రీమ్‌ను 7 నుంచి 10 రోజుల వరకు ఫ్రిజ్‌లో భద్రంగా ఉంచవచ్చు. ఇంత కంటే ఎక్కువసేపు ఉంచితే అది పుల్లగా మారడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు వాసన రావడం కూడా ప్రారంభమవుతుంది. నెయ్యి రుచి, వాసన బాగా ఉండాలంటే, వారంలోపు నిల్వ చేసిన క్రీమ్‌ను ప్రాసెస్ చేసి, దాని నుండి వెన్నను తీసి, నెయ్యి తయారు చేసుకోవచ్చు. వెన్న నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని పాత్రలోనే ఉంచాలి. మూత వదులుగా ఉంటే, ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర వస్తువులు వాసన పీల్చుకుంటుంది. దీంతో నెయ్యి నాణ్యత ప్రభావితం అవుతుంది. అలాగే, వెన్నని ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లోని అత్యంత చల్లని భాగంలో మాత్రమే నిల్వ ఉంచాలి. ఫ్రిజ్ డోర్‌ వద్ద మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే తరచుగా తెరవడం, మూసివేయడం వల్ల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. దీంతో వెన్న త్వరగా చెడిపోతుంది.

వెన్నను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే దానిని ఫ్రీజర్‌లో ఉంచవచ్చు. ఫ్రీజర్‌లో ఉంచిన క్రీమ్ దాదాపు 20-25 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత, క్రీమ్‌ను నెయ్యిగా మార్చడానికి ముందు చల్లబడేంత వరకు వేచి ఉండాలి. అయితే క్రీమ్‌ను ఎక్కువ రోజులు నిల్వ చేస్తే, నెయ్యి నాణ్యత, వాసన అంతగా బాగోదు. వెన్న దుర్వాసన రావడం, దాని రంగు పసుపు రంగులోకి మారినట్లు మీరు గమనించినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే అది కుళ్ళిపోయే అవకాశం ఉంది. మీరు ప్రతిరోజూ వెన్న నిల్వ చేస్తే 7 నుంచి 10 రోజుల మధ్య నెయ్యి చేయడం మంచిది. అదే మూడు లేదా నాల్గవ రోజు క్రీమ్ నుంచి నెయ్యిని తయారు చేస్తే.. నెయ్యి తాజాగా, రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్నా ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.