ఈ చిన్న చిట్కాతో మీ ఇంటిలో నూనెను ప్రతీ నెలా ఆదా చేయవచ్చు.. ఎలానో మీరూ చూడండి

వంటకు వాడిన నూనెలో మలినాలు మిగిపోయి మళ్ళీ వాడటానికి ఇబ్బందిగా ఉంటుంది.? ఈ చిన్న చిట్కాతో కేవలం నిమిషాల్లో వాడిన నూనెను మళ్ళీ ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. ఇలా చేస్తే మీరు..

ఈ చిన్న చిట్కాతో మీ ఇంటిలో నూనెను ప్రతీ నెలా ఆదా చేయవచ్చు.. ఎలానో మీరూ చూడండి
Used Oil

Updated on: Mar 27, 2026 | 10:50 AM

మనం ఇంట్లో వడలు, పూరీలు లేదా బజ్జీలు వేయించుకున్నప్పుడు నూనెలో చిన్న చిన్న మలినాలు ఉండిపోతాయి. ఆ నూనెను అలాగే ఉంచితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరోసారి వంటకు వాడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. వడకట్టినా కూడా చిన్న మలినాలు అలాగే ఉండిపోతాయి. అయితే ఈ పద్ధతి ద్వారా వాడిన నూనెను మళ్లీ తాజా నూనెలా మార్చుకోవచ్చు, వృధాను తగ్గించుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..! వంట చేసిన తర్వాత మిగిలిపోయిన నూనెను తిరిగి ఉపయోగించాలంటే, అది శుభ్రంగా ఉండటం అవసరం. సాధారణంగా, నూనెను వడపోసినప్పుడు, అన్ని మలినాలు పూర్తిగా తొలగవు. అలాంటి సందర్భాలలో, నూనెను తిరిగి వాడటానికి ఇష్టపడరు. అయితే, ఒక సులభమైన పద్ధతి ద్వారా వాడిన నూనెను మళ్లీ తాజా నూనెలా మార్చుకోవచ్చు.

ఈ విధానం కోసం, మొదటగా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ను తీసుకొని, తగినంత నీటిని కలిపి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత, వాడిన నూనెను స్టవ్‌పై పెట్టి కొద్దిగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో పోయాలి. కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసిన వెంటనే, నూనెలోని మలినాలు కార్న్‌ఫ్లోర్‌తో కలిసి ఒక ముద్దగా ఏర్పడి, నూనె నుంచి వేరవుతాయి. ఈ ముద్దను తొలగించిన తర్వాత, నూనె పూర్తిగా స్వచ్ఛంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఈ పద్ధతి ద్వారా నూనె వృధాను తగ్గించి, శుభ్రమైన నూనెను తిరిగి ఉపయోగించుకోవచ్చు.

Follow Us