Kitchen Hacks: ఈ చిట్కాలు పాటించి చూడండి.. మీ ఫ్రిడ్జ్ ఫ్రెష్ గా, మంచి స్మెల్ తో ఉంటుంది..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ తప్పనిసరి అయింది. ఆహార వస్తువులను తాజాగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లోపల నుండి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఇది మనం నిల్వ చేసే ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల గానీ.. ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోవడం వల్ల గానీ కావచ్చు. అయితే ఈ సమస్యను పోగొట్టడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Kitchen Hacks: ఈ చిట్కాలు పాటించి చూడండి.. మీ ఫ్రిడ్జ్ ఫ్రెష్ గా, మంచి స్మెల్ తో ఉంటుంది..!
Fridge Bad Odor Solution

Updated on: May 21, 2025 | 2:57 PM

కొద్దిగా నిమ్మరసాన్ని బేకింగ్ సోడాలో కలిపి ఆ మిశ్రమాన్ని ఒక బట్టతో ఫ్రిడ్జ్ లోపల అంతా రుద్దాలి. ఇది శుభ్రం చేయడంతో పాటు మంచి తాజా వాసనను ఇస్తుంది. ఈ పద్ధతి చెడు వాసనను పూర్తిగా పోగొట్టడానికి సహాయపడుతుంది. చిన్న చిన్న సంచుల్లో గసగసాలు లేదా లవంగాలు వేసి ఫ్రిడ్జ్ లోపల పెడితే చెడు వాసనలను పీల్చుకొని ఫ్రిడ్జ్‌ను శుభ్రంగా ఉంచుతాయి. వీటిలో ఉండే సహజ వాసనలు ఫ్రిడ్జ్‌ లో మంచి సువాసనను ఇస్తాయి.

వెనీలా ఎసెన్స్‌ ను దూది మీద వేసి ఫ్రిజ్‌ లో ఉంచితే అక్కడ మంచి వాసన వస్తుంది. ఇది ఫ్రిడ్జ్‌ లో ఉన్న దుర్వాసనను మాయం చేయడమే కాదు.. కొత్త ఫ్రెష్‌ నెస్‌ ను కూడా తెస్తుంది.

కాఫీ పొడికి మంచి సువాసన ఉంటుంది. దాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచితే చెడు వాసనను తగ్గించి మంచి వాసన వచ్చేలా చేస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు.

న్యూస్ పేపర్‌ను గోళీలా చేసి ఫ్రిడ్జ్ లోపల భాగాల్లో ఉంచితే అవి లోపల నుండి వాసనను పీల్చుకుంటాయి. ఇది తక్కువ ఖర్చుతో అయ్యే మంచి పరిష్కారం.

కొద్దిగా వెనిగర్‌ను నీటిలో కలిపి ఫ్రిడ్జ్ లోపల భాగాలను తుడవడం వల్ల బ్యాక్టీరియా, వాసన కలిగించే క్రిములు పోతాయి. ఇది ఫ్రిడ్జ్‌ను శుభ్రంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది.

యాక్టివేటెడ్ చార్కోల్‌ మార్కెట్‌ లో సులువుగా దొరుకుతుంది. ఒక చిన్న డబ్బాలో చార్కోల్ పొడిని వేసి ఫ్రిజ్‌లో ఉంచితే అది చెడు వాసనలను పూర్తిగా పీల్చుకుంటుంది. ఫ్రిడ్జ్‌ కు మంచి, స్వచ్ఛమైన వాతావరణాన్ని తెస్తుంది.

నిమ్మకాయను సగం కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే అందులోని సిట్రిక్ వాసన ఫ్రిడ్జ్‌ లో మంచి పరిమళాన్ని వ్యాపింపజేసి చెడు వాసనను తగ్గిస్తుంది. కొద్ది రోజులకు ఒక్కసారి వీటిని మారుస్తూ ఉండాలి.

ఫ్రిడ్జ్‌ ను శుభ్రంగా ఉంచడం వల్లే కాదు.. పైన చెప్పిన చిట్కాలు కూడా దుర్వాసన నుంచి బయటపడటానికి సహాయపడతాయి. ఇవన్నీ ఇంట్లోనే దొరికే వాటితో సులువుగా చేయొచ్చు. ఖర్చు తక్కువగా ఉంటుంది. ఫలితం మంచిగా ఉంటుంది. మీరు కూడా ఇవి ప్రయత్నించి మీ ఫ్రిజ్‌ ను ఫ్రెష్‌ గా శుభ్రంగా ఉంచుకోండి.