మీ వంటింట్లో బొద్దింకలా.. అయితే ఫాలో దీస్ టిప్స్

వంటిల్లు.. ఇది శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉండేది. అయితే ఈ వంటిట్టోకి రకరకాల కీటకాలు, క్షీరదాలు వస్తూ.. వంటకాలపై వాలుతుంటాయి. దీంతో ఆ ఆహారాన్ని మనం తీసుకుంటే అస్వస్థతకు గురవ్వాల్సిందే. అయితే వంటింట్లోకి వచ్చే కీటకాల్లో బొద్దింక ఒకటి. ముఖ్యంగా కిచెన్ సింక్‌లో బొద్దింకల సమస్య ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల మందుల్ని ప్రయోగించినా ఈ బొద్దింకల పూర్తిగా నివారించలేం. కానీ కొన్ని రకాల చిట్కాలతో వాటిని వంటింట్లోకి శాశ్వతంగా రాకుండా చేయవచ్చు. ఆ చిట్కాలేంటో […]

మీ వంటింట్లో బొద్దింకలా.. అయితే  ఫాలో దీస్ టిప్స్

వంటిల్లు.. ఇది శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉండేది. అయితే ఈ వంటిట్టోకి రకరకాల కీటకాలు, క్షీరదాలు వస్తూ.. వంటకాలపై వాలుతుంటాయి. దీంతో ఆ ఆహారాన్ని మనం తీసుకుంటే అస్వస్థతకు గురవ్వాల్సిందే. అయితే వంటింట్లోకి వచ్చే కీటకాల్లో బొద్దింక ఒకటి. ముఖ్యంగా కిచెన్ సింక్‌లో బొద్దింకల సమస్య ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల మందుల్ని ప్రయోగించినా ఈ బొద్దింకల పూర్తిగా నివారించలేం. కానీ కొన్ని రకాల చిట్కాలతో వాటిని వంటింట్లోకి శాశ్వతంగా రాకుండా చేయవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.

* మీ కిచెన్‌లో బొద్దింకల సమస్యల ఉంటే.. కొన్ని వెల్లుల్లిని తీసుకుని వాటిని దంచండి. ఆ దంచిన మిశ్రమాన్ని నీటితో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. ఇది
బొద్దింకలకు విరుగుడుగా పనిచేస్తుంది.

* అంతేకాదు బోరిక్ పౌడర్‌ను ఉపయోగించి కూడా బొద్దింకలకు చెక్ పెట్టవచ్చు. కిచెన్‌లోని మూలల్లో బోరిక్ పౌడర్‌ను చల్లితే బొద్దింకలు మాయమవుతాయి.

* బేకింగ్‌ సోడా,చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమేయొచ్చు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu