గ్రే హెయిర్ కోసం నేచురల్ హెయిర్ డై.. మీ ఇంట్లో ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు..

|

May 30, 2023 | 3:10 PM

ఒక ఇనుప పాత్రలో 5 స్పూన్ల హెన్నా పౌడర్ వేసి, పైన ఉన్న మిశ్రమాన్ని కలపండి. తర్వాత దీన్ని ఐరన్ పాన్‌లో 6 గంటల పాటు ఉంచి, ఆపై మీ జుట్టుకు పట్టించాలి. ఈ రంగును కనీసం 2 గంటలు అలాగే అప్లై చేసుకుని ఆరనివ్వాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు.

గ్రే హెయిర్ కోసం నేచురల్ హెయిర్ డై.. మీ ఇంట్లో ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు..
Gray Hair
Follow us on

జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్‌లో చాలా రకాల హెయిర్ డైస్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిని ఉపయోగించిన తర్వాత, గ్రే హెయిర్ తగ్గదు, ఆ హెయిర్ డైస్ కొన్ని రోజుల వరకు తెల్ల జుట్టును కవర్ చేస్తాయి. అయితే, ఇంట్లో తయారుచేసిన రంగును పూయడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పొడవు పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. బూడిద రంగును ఆపడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సహజ పదార్థాలు మాత్రమే ఉపయోగించబడతాయి. కాబట్టి ఈ కథనంలో కొన్ని కిచెన్ వస్తువుల సహాయంతో సహజసిద్ధంగా హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

మన శరీరం సహజంగా జుట్టులో ప్రతిబింబించే మెలనిన్ పరిమాణాన్ని తగ్గించినప్పుడు ఇది సాధారణంగా జుట్టు నెరసిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ మెలనిన్ వల్ల నల్లటి జుట్టుకు రంగు వస్తుంది. శరీరంలో ఈ మెలనిన్ తగ్గినప్పుడు, మన జుట్టు రంగు మారుతుంది. ఇది బూడిద జుట్టుకు ప్రధాన కారణం.

నేచురల్ హెయిర్ డైని తయారు చేయడానికి కావలసినవి:

ఈ నేచురల్ హెయిర్ డైని తయారు చేయడానికి, మీకు 5 నుండి 6 దానిమ్మ తొక్కలు, ఒక చిన్న బ్రూ కాఫీ పొడి, ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ జామకాయ పొడి, 5 టీస్పూన్ల హెన్నా పౌడర్, ఒక నీళ్ల గ్లాస్ అవసరం.

ఇవి కూడా చదవండి

నేచురల్ హెయిర్ డై రిసిపి:

దీన్ని తయారు చేయడానికి మీకు ఐరన్ పాన్ అవసరం. ఈ పాన్‌ను గ్యాస్‌పై ఉంచి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ తర్వాత దానిమ్మ తొక్కలు, నల్ల మిరియాల పొడి, బ్రూ కాఫీ వేసి 15 నిమిషాలు తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. ఆ తర్వాత, గ్యాస్‌ను ఆపివేసి, ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూతపెట్టి ఉంచండి. ఆ మర్నాడు ఉదయం ఒక పాత్రలో స్ట్రైనర్ సహాయంతో మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి, ఒక ఇనుప పాత్రలో 5 స్పూన్ల హెన్నా పౌడర్ వేసి, పైన ఉన్న మిశ్రమాన్ని కలపండి. తర్వాత దీన్ని ఐరన్ పాన్‌లో 6 గంటల పాటు ఉంచి, ఆపై మీ జుట్టుకు పట్టించాలి. ఈ రంగును కనీసం 2 గంటలు అలాగే అప్లై చేసుకుని ఆరనివ్వాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం…