గోంధ్ కటోరా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కటోరాలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. శరీరానికి చలువ చేసే వాటిల్లో గోంధ్ కటోరా కూడా ఒకటి. దీన్ని ఎక్కువగా బాలింతలు, గర్భిణీలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కటోరా కడుపులో మంట, ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. గోంధ్ కటోరాను ఎలా తీసుకున్నా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కటోరాను నీటిలో వేస్తే జల్ గా మారే దాన్నే మనం తీసుకోవాలి. గోంధ్ కటోరాతో పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. కటోరా పాయసాన్ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోంధ్ కటోరాకు కావాల్సిన పదార్థాలు:
గోంధ్ కటోరా, పటిక బెల్లం పొడి, పాలు, సగ్గుబియ్యం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్.
కటోరా పాయసం తయారీ విధానం:
కటోరా పాయసాన్ని తయారు చేసుకునే ముందు రోజు రాత్రే.. కటోరాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నాన బెట్టాలి. ఇలా చేయడం వల్ల కటోరా జెల్ గా మారుతుంది. ఉదయం ఒక గిన్నెలోకి వేడి నీళ్లు వేసికుని అరగంట ముందు సగ్గు బియ్యాన్ని నాన బెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సగ్గు బియ్యం, నానబెట్టిన గోంధ్ కటోరా రెండు కలిపి వేసుకుని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. పాలు పోసి కలుపుకోవాలి. పాలు వేసుకున్నాక.. మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. నెక్ట్స్ మరో 5 నిమిషాలు ఉడికించు కోవాలి. పాయసం దగ్గర పడుతుంది అనే సమయంలో.. కుంకుమ పువ్వును పాలలో కలిపి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. కావాలనుకున్న వారు యూజన్ చేసుకోవచ్చు.
పాయసం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవమే. ఇప్పుడు కటోరా పాయసంపై డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపి సర్వ్ చేసుకోవడమే. దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకుకోవచ్చు. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కటోరా పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడి చేసినప్పుడు లేదా సమ్మర్ లో చేసుకుని తింటే చాలా చలువ చేయడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కటోరా బాడీని కూల్ చేస్తుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.