చలికాలం రాగానే చర్మం పొడిబారడం, తేమ లేకపోవడం మొదలవుతుంది. చల్లని గాలులు మన చర్మాన్ని పొడిబారి నిర్జీవంగా మారుస్తాయి. అటువంటి పరిస్థితిలో సరైన చర్మ సంరక్షణ తప్పనిసరి. అయితే తరచుగా మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు మన ముఖంలోని మెరుపును నాశనం చేస్తాయి. చలికాలంలో ముఖ చర్మానికి హాని కలిగించే అంశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం:
చలికాలంలో చాలా మంది వేడి నీటిని వాడుతుంటారు. కానీ ముఖంపై ఎక్కువ వేడి నీటిని ఉపయోగించడం వల్ల చర్మం పై పొర దెబ్బతినడంతోపాటు పొడిబారుతుంది. దీని కారణంగా, చర్మం సాగినట్టుగా మారుతుంది. ముఖానికి చల్లటి నీరు లేదంటే, గోరువెచ్చని నీటిని వాడితే బాగుంటుంది.
సన్‌స్క్రీన్ అప్లై చేయకపోవడం:
చలికాలంలో ఎండ ఎక్కువగా లేదని సన్‌స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు. కానీ ఈ ఆలోచన తప్పు. చల్లని వాతావరణంలో కూడా, సూర్యుని హానికరమైన కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిరోజూ కనీసం 30 SPFతో సన్‌స్క్రీన్‌ని తప్పనిసరిగా అప్లై చేసుకోవటం మంచి అలవాటు.
తరచుగా స్క్రబ్బింగ్ చేయడం:
చలికాలంలో చర్మం సాధారణ రోజుల్లో కంటే సున్నితంగా మారుతుంది. పదే పదే స్క్రబ్బింగ్ చేయడం వల్ల ముఖంలోని తేమ తొలగిపోయి చర్మంపై చికాకు కలుగుతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు తేలికపాటి స్క్రబ్ చేయటం మంచిది.
సరిపడా నీళ్లు తాగకపోవడం:
చల్లటి వాతావరణంలో దాహం తక్కువగా ఉంటుంది. కానీ శరీరానికి నీరు అవసరం లేదని దీని అర్థం కాదు. తక్కువ నీరు తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగాలి.
మాయిశ్చరైజర్ వాడకపోవడం:
చలికాలంలో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వాడటం చాలా ముఖ్యం. ఇది చర్మం తేమను కాపాడుతుంది. పొడిబారకుండా చేస్తుంది. దీంతో మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉండటానికి మీరు ఫేస్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..