AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే ఇలాచీ మొక్కను ఇలా పెంచండి.. మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ ఇవే..

వంటింట్లో ఘుమఘుమలాడే సువాసనలైనా, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలైనా.. మసాలాల రాణి యాలకుల స్థానం ప్రత్యేకం. మార్కెట్‌లో వేల రూపాయలు పలికే ఈ ఖరీదైన మసాలా దినుసును మనం ఇంట్లోనే, అదీ ఓ చిన్న కుండీలో సులభంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? బాల్కనీలో లేదా పెరట్లో పెద్దగా స్థలం లేకపోయినా పచ్చగా కళకళలాడుతూ పంటనిచ్చేలా యాలకుల మొక్కను ఎలా పెంచుకోవాలో ఈ సింపుల్ టిప్స్ ద్వారా తెలుసుకోండి.

ఇంట్లోనే ఇలాచీ మొక్కను ఇలా పెంచండి.. మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ ఇవే..
How To Grow Cardamom Plant At Home
Krishna S
|

Updated on: Oct 07, 2026 | 8:16 PM

Share

సుగంధ ద్రవ్యాల్లో మసాలాల రాణిగా పిలువబడే ఇలాచీలకు భారతీయ వంటింట్లో ప్రత్యేక స్థానం ఉంది. పాయసం, బిర్యానీ, మసాలా టీ ఇలా ఏ వంటకమైనా చిటికెడు యాలకుల పొడి పడితే ఆ రుచే వేరు. కేవలం సువాసన, రుచి మాత్రమే కాకుండా ఇందులో జింక్, పొటాషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఈ మసాలా దినుసును మనం ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఒక చిన్న కుండీలోనే సులభంగా పెంచుకోవచ్చు. ఇంట్లోనే సహజసిద్ధంగా యాలకుల మొక్కను ఎలా పెంచవచ్చో తెలుసుకోవడ ముఖ్యం.

మొక్కల ఎంపిక: నారు లేదా విత్తనాలు

యాలకుల మొక్కను రెండు పద్ధతుల్లో పెంచుకోవచ్చు. నర్సరీల నుంచి నేరుగా నారు మొక్కలను తెచ్చుకుని నాటుకోవడం ఒక పద్ధతి అయితే విత్తనాల ద్వారా పెంచడం రెండో విధానం. విత్తనాల ద్వారా పెంచాలనుకుంటే మార్కెట్ నుంచి రసాయనాలు లేని పచ్చి, తాజా యాలకులను ఎంపిక చేసుకోవాలి. కాయల పైపొట్టు తీసి విత్తనాలను శుభ్రంగా కడగాలి. మొలకల శాతం పెరిగేందుకు ఈ విత్తనాలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.

మట్టి మిశ్రమం తయారీ

యాలకుల మొక్క ఏపుగా పెరగడానికి నీరు నిల్వ ఉండని నేల ఎంతో అవసరం. సాధారణ తోట మట్టితో పాటు సమాన పాళ్లలో ఇసుక, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కలిపి కుండీని సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమం వల్ల మట్టి తేలికగా మారి వేర్లకు గాలి ఆడుతుంది. నీరు వేర్ల వద్ద నిలవకుండా బయటకు పోయేలా కుండీ అడుగున రంధ్రం ఉండేలా చూసుకోవాలి.

విత్తనాలు నాటే విధానం – సంరక్షణ

నానబెట్టిన విత్తనాలను ముందుగా చిన్న ట్రే లేదా కప్పులో మట్టిపై చల్లి, వాటిపై పలుచగా మట్టి పొరను పరవాలి. విత్తనాలను మరీ లోతుగా నాటకూడదు. తేలికపాటి తేమ ఉండేలా రోజూ నీళ్లు చల్లుతూ, కొద్దిగా ఎండ, ఎక్కువ నీడ ఉండే ప్రదేశంలో ఉంచాలి. కొన్ని వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. మొక్క 3 నుంచి 4 అంగుళాల ఎత్తు పెరిగాక దానిని పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. సుమారు 30 నుంచి 40 రోజుల తర్వాత మొక్క కొత్త కొమ్మలతో దట్టంగా మారడం ప్రారంభిస్తుంది.

అనుకూలమైన వాతావరణం

యాలకుల మొక్కలకు చల్లని, తేమతో కూడిన వాతావరణం బాగా సరిపోతుంది. వీటిని నేరుగా తీవ్రమైన ఎండ తగిలే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత తక్కువగా ఉండే బాల్కనీలలో లేదా పెద్ద చెట్ల నీడలో కుండీలను ఉంచడం మంచిది.

పంట చేతికి వచ్చేది ఎప్పుడు?

యాలకుల మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉండి ఇంటికి అందాన్ని ఇస్తుంది. అయితే ఇది చాలా నెమ్మదిగా పెరిగే మొక్క. నాటిన తర్వాత పువ్వులు పూసి, కాయలు కాయడానికి సాధారణంగా రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. సరైన తేమ, సేంద్రియ పోషకాలు అందిస్తూ కాస్త ఓపికతో సంరక్షిస్తే.. ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన, సువాసనభరితమైన యాలకులను మన ఇంట్లోనే కోసుకోవచ్చు.

Follow Us
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఈశ్వర్ సాయి కొత్త ఫోక్ సాంగ్
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఈశ్వర్ సాయి కొత్త ఫోక్ సాంగ్
స్టార్క్ ఔట్, పంత్ ఇన్.. ఢిల్లీ రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే..!
స్టార్క్ ఔట్, పంత్ ఇన్.. ఢిల్లీ రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే..!
ఉచితంగా సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఏడాదికి 4 సార్లు..
ఉచితంగా సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఏడాదికి 4 సార్లు..
కోనసీమ కింద మందుపాతర.. గ్యాస్‌లీకులతో గుండె గుభేల్..
కోనసీమ కింద మందుపాతర.. గ్యాస్‌లీకులతో గుండె గుభేల్..
నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు..
నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు..
ఉద్యోగం కోసం వెళ్తే యుద్ధ భూమిలోకి నెట్టారు.. రష్యాలో చిక్కుకున్న
ఉద్యోగం కోసం వెళ్తే యుద్ధ భూమిలోకి నెట్టారు.. రష్యాలో చిక్కుకున్న
ఆయుష్మాన్ భారత్ కార్డు పోయిందా..? మొబైల్‌లో డౌన్‌లోడ్ చేస్కోండిలా
ఆయుష్మాన్ భారత్ కార్డు పోయిందా..? మొబైల్‌లో డౌన్‌లోడ్ చేస్కోండిలా
అర్ధరాత్రి అమ్మాయిల హత్యలు.. OTTలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
అర్ధరాత్రి అమ్మాయిల హత్యలు.. OTTలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
చిరంజీవి, విజయశాంతి కాంబోలో క్రేజీ సాంగ్.. ఇప్పుడు విన్నా ఆ మజానే
చిరంజీవి, విజయశాంతి కాంబోలో క్రేజీ సాంగ్.. ఇప్పుడు విన్నా ఆ మజానే
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి అతి భారీ వర్షాలు
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి అతి భారీ వర్షాలు