ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. లవర్ లేదని సింగిల్‌గా ఉన్నామని కొంతమంది పడే బాధ వర్ణాతీతం.ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు తనకు లవర్ లేదు కదా అంటూ బాధపడుతుంటారు. కొందరు ఇదే ఆలోచనలతో మానసిక కుంగుబాటుకు గురవుతుంటారు. కానీ ప్రేమించి తెచ్చుకునే తంటాల కంటే …లవర్ లేకుంటే హ్యాపీగా ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా ప్రేమికుల రోజు ఆనందంగా ఉండేందుకు కొన్ని ప్లాన్స్ వేసుకుంటే చాలు. సింగిల్‌గా ఉన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
ప్రేమికుల రోజు అంటే ..ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పట్ల ప్రేమను ముఖ్యంగా మన మీద మనం ప్రేమను కూడా చూపించుకోవచ్చు. ప్రేమికుల రోజును కేవలం జంటల కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిది కాదు. ఒంటరిగా ఉన్నవారు ఆరోజును సెలబ్రేట్ చేసుకోకూడదని ఎక్కడా రాసి లేదు. మిమ్మల్ని మీరు అన్వేషించడానికి ఒక గొప్పరోజు అనుకోవడంలో తప్పులేదు. మన జీవితంలో చాలామంది ఉన్నారు. ఫ్యామిలీ కావచ్చు, స్నేహితులు కావచ్చు …వారితో ఆ రోజు గడిపేలా ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచించినట్లయితే..మీకోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం.. అవి ఫాలో అవ్వండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..