మీ నోటి చుట్టూ చర్మం నల్లగా ఉందా..? ఈ సింపుల్ హోం రెమెడీస్‌ మీ కోసమే.. ట్రై చేసి చూడండి..

కొంతమందికి నోటి చుట్టూ నల్లటి మచ్చలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్‌ చికిత్సలు, మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. నోటి చుట్టూ నల్లటి చర్మానికి కొన్ని ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి.

మీ నోటి చుట్టూ చర్మం నల్లగా ఉందా..? ఈ సింపుల్ హోం రెమెడీస్‌ మీ కోసమే.. ట్రై చేసి చూడండి..
Dark Skin

Updated on: Sep 02, 2025 | 4:14 PM

ముఖం మీద నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ సర్వసాధారణం. కొంతమందిలో అవి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కారణం చేత చర్మం దెబ్బతిన్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి నోటి చుట్టూ నల్లటి మచ్చలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్‌ చికిత్సలు, మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. నోటి చుట్టూ నల్లటి చర్మానికి కొన్ని ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి.

పసుపు-నిమ్మరసం- ఒక టీస్పూన్ నిమ్మరసంలో చిటికెడు పసుపు పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లటి చర్మంపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.

బంగాళాదుంప రసం- తాజా బంగాళాదుంప రసం, లేదా బంగాళాదుంప ముక్కను మీ నోటి చుట్టూ రుద్దండి. బంగాళాదుంపలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నల్లటి చర్మాన్ని తొలగించి మళ్ళీ మెరిసేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

కలబంద జెల్- ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ తో ఒక విటమిన్ E క్యాప్సూల్ కలపండి. దీన్ని మీ నోటి చుట్టూ ఉన్న నల్లటి చర్మంపై అప్లై చేయండి. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేసి ఉదయం కడిగేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

శనగ పిండి- ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు కలిపి ఈ పేస్ట్ ను నల్లటి చర్మంపై అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

బొప్పాయి- బొప్పాయిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి చుట్టూ ఉన్న నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి బొప్పాయిని పేస్ట్ లా చేసి, రోజ్ వాటర్ తో కలిపి, ఈ పేస్ట్ ను నోటి చుట్టూ అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.