AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిటికెలో నిద్రపట్టాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..

రాత్రి ఎంత ప్రయత్నించినా మంచంపై పడుకోగానే నిద్ర రావడం లేదా? గంటల తరబడి అటు ఇటు దొర్లుతూ తెల్లవార్ల వరకు మేల్కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే. నిద్రలేమితో బాధపడే వారి కోసం సైన్స్ నిరూపించిన అద్భుతమైన ట్రిక్స్ ఉన్నాయి. మరి మంచం ఎక్కగానే త్వరగా, హాయిగా నిద్రపట్టాలంటే మనం పాటించాల్సిన సింపుల్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం..

చిటికెలో నిద్రపట్టాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..
How To Fall Asleep Fast At Night
Krishna S
|

Updated on: Jul 19, 2026 | 8:42 PM

Share

శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నేటి ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రీన్లు చూడటం, చెడిపోయిన దినచర్యల వల్ల చాలామందికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. మంచంపై పడుకున్నా గంటల తరబడి నిద్రపట్టకపోవడం, ఒకవేళ పట్టినా రాత్రిపూట పదే పదే మెలకువ రావడం వంటి సమస్యలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. దీనివల్ల మరుసటి రోజు తీవ్ర అలసట, చిరాకు, పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడో ఒకసారి నిద్రపట్టకపోవడం సాధారణమే అయినప్పటికీ, రోజూ ఇదే సమస్య వేధిస్తుంటే మాత్రం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట త్వరగా, హాయిగా నిద్రపట్టడానికి సహాయపడే కొన్ని అద్భుతమైన ట్రిక్స్, దూరంగా పెట్టాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.

త్వరగా నిద్రపట్టడానికి 5 బెస్ట్ ట్రిక్స్..

4-7-8 బ్రీతింగ్ ట్రిక్ పాటించండి

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. నిద్రపట్టని వారికి 4-7-8 శ్వాస ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. మంచంపై పడుకుని మొదట 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత 7 సెకన్ల పాటు శ్వాసను లోపలే ఆపాలి. చివరిగా 8 సెకన్ల పాటు నోటి ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలాలి. ఇలా కొన్ని సార్లు చేస్తే మైండ్ ప్రశాంతంగా మారి నిద్ర ముంచుకొస్తుంది.

బెడ్‌రూమ్ వాతావరణం మార్చండి

పడుకునే ముందు గదిలోని లైట్లను పూర్తిగా తగ్గించి, చీకటిగా ఉంచాలి. గది ఉష్ణోగ్రత మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి.

బాడీ క్లాక్ సెట్టింగ్

మన శరీరానికి ఒక నిర్దిష్టమైన బాడీ క్లాక్ ఉంటుంది. అది సరిగ్గా పనిచేయాలంటే రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఉదయాన్నే ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.

మజిల్ రిలాక్సేషన్ – మెడిటేషన్

మంచంపై పడుకున్నాక కాసేపు ధ్యానం చేయడం లేదా ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ పద్ధతిని పాటించాలి. అంటే శరీరంలోని కండరాలను కొన్ని సెకన్ల పాటు గట్టిగా బిగబట్టి, ఆ తర్వాత వదిలేయాలి. దీనివల్ల శరీరం త్వరగా రిలాక్స్ అవుతుంది.

మంచంపై బలవంతంగా పడుకోవద్దు

మంచంపై చేరిన 20 నిమిషాల వరకు కూడా మీకు నిద్రపట్టకపోతే, బలవంతంగా అలాగే పడుకోకండి. మంచం దిగి హాల్లోకి వచ్చి కాసేపు ఏదైనా తేలికపాటి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం చేయాలి. మళ్లీ నిద్ర వస్తున్నట్లు అనిపించినప్పుడే బెడ్ రూమ్‌కి వెళ్లాలి.

పడుకునే ముందు అస్సలు చేయకూడని పనులు..

కెఫిన్‌కు దూరం: రాత్రి పడుకునే ముందు టీ, కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇవి నిద్రను పూర్తిగా దూరం చేస్తాయి.

భారీ భోజనం వద్దు: రాత్రి పూట అతిగా మసాలాలు ఉన్న ఆహారాన్ని లేదా భారీ భోజనాన్ని తీసుకోకూడదు. ఇది అజీర్ణానికి దారితీసి నిద్రను పాడు చేస్తుంది.

డిజిటల్ గ్యాడ్జెట్స్: మంచంపై పడుకుని గంటల తరబడి మొబైల్ వాడటం, టీవీ చూడటం అస్సలు మంచిది కాదు. స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును మేల్కొని ఉండేలా చేస్తుంది.

భారీ వ్యాయామం: పగటిపూట క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నిద్రకు మంచిదే కానీ, రాత్రి పడుకునే ముందు మాత్రం హెవీ వర్కవుట్స్ చేయకూడదు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ఒకవేళ మీకు చాలా కాలంగా నిరంతరం నిద్రలేమి సమస్య వేధిస్తున్నా, రాత్రిపూట పదే పదే నిద్ర భంగమవుతున్నా ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట తీవ్ర అలసట రావడం, నిద్రపోయేటప్పుడు గట్టిగా గురక పెట్టడం లేదా శ్వాస ఆగిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Follow Us