AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationships Tips: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రాకూడదంటే.. ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Love and Relationships Tips: వర్క్ ఫ్రమ్ హోమ్‌తోపాటు తీవ్ర పని ఒత్తిడి వల్ల చాలా మంది చిటికీమాటికీ కోపం తెచ్చుకుంటున్నారు. ఈ కోపం భార్యాభర్తల మధ్య గ్యాప్ తీసుకోస్తుందంటూ పలువురు సైకాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు.

Relationships Tips: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రాకూడదంటే.. ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Relationship
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2022 | 8:43 AM

Share

Love and Relationships Tips: వర్క్ ఫ్రమ్ హోమ్‌తోపాటు తీవ్ర పని ఒత్తిడి వల్ల చాలా మంది చిటికీమాటికీ కోపం తెచ్చుకుంటున్నారు. ఈ కోపం భార్యాభర్తల మధ్య గ్యాప్ తీసుకోస్తుందంటూ పలువురు సైకాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో మీపై కోపంగా ఉన్న భార్యను కంట్రోల్ చేయకపోతే.. వివాహబంధంలో మరింత గ్యాప్ వస్తుందంటూ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సతీమణి కోపాన్ని తగ్గించే చిట్కాలు పాటించడం మంచిది. ఇక్కడ ఇచ్చిన సూచనలను ఒకసారి పరిశీలించి సమయం వచ్చినప్పుడల్లా ఆచరించడానికి ప్రయత్నించండి.

  1. ఆమె మెల్టింగ్ పాయింట్‌ను తెలుసుకోండి: కోపంగా ఉన్న సమయంలో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికీ ఒక వీక్నెస్ ఉంటుంది. దానిని గుర్తుంచుకోండి. మీరు ఆమెకు కోపం వచ్చే విధంగా తప్పు చేస్తే.. ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించండి. ఇలాంటి సమయంలోనే ఆమె వద్దకు వచ్చి.. దానికి గల కారణాలను వివరించి చెప్పండి.
  2. ఆమె కోపాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి: ఆమె మీపై కోపంగా, ఆవేశంలో ఉంటే.. మీ మాట వినడానికి సిద్ధంగా ఉండదు. కావున సరియైన సమయం కోసం వేచిచూడండి. కోపం తగ్గేంత వరకు ఆమె చెప్పేదంతా వినండి. ఆమె శాంతించిన తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. కోపంగా ఉన్న ఎవరితోనైనా వాదించడం అర్థరహితం. ఆమె మాట్లాడే సమయంలో అస్సలు మాట్లాడకుండా.. కోపాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.
  3. సరేండర్: నిశ్శబ్దంగా ఉండటానికి లేదా వాదించడానికి బదులుగా ఆమెకు లొంగిపోవడమే ఉత్తమమైన మార్గం అని పలువురు పేర్కొంటున్నారు. మీరు ఆమెతో ఏకీభవిస్తున్నానంటూ చెప్పే మీ మాటలు ఆమెను శాంతింపజేస్తాయి. అప్పుడప్పుడు తల వంచండం మంచిదే. భార్యాభర్తలు బంధంలో అప్పుడప్పుడు పొరపచ్చాలు సాధరణం. కావున పట్టింపులకు పోకండి.
  4. మహిళలు తరచూ కోపంతో బాధపడుతుంటారు. ఎందుకంటే వారు ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలి. కావున.. వారు మిమ్మల్ని బాధపెట్టే విషయాలు మీతో పంచుకోవచ్చు. అలాంటి విషయాలను అక్కడితోనే వదిలివేయండి. అర్ధం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నించండి. సూటిపోటి మాటలనకుండా వారితో అన్యోన్యంగా ఉండండి.

Also Read:

AP New Cabinet: ఇవాళ కొలువుదీరనున్న జగన్ నూతన మంత్రివర్గం.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం..

Maha Dharna: ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. రైతుల పక్షాన దీక్షకు దిగుతున్న సీఎం కేసీఆర్‌..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!