AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips: టీవీ క్లీన్ చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ జెబుకు చిల్లే!

చాలా మంది ఇళ్లలో ఉన్న టీవీపై దుమ్ము , మరకలు పడ్డుప్పుడు.. ఇంట్లో దొరికే ఏదో ఒక క్లాత్ తీసుకొని వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు స్క్రీన్ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖరీదైన స్మార్ట్ టీవీని సురక్షితంగా, దెబ్బతినకుండా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cleaning Tips: టీవీ క్లీన్ చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ జెబుకు చిల్లే!
Cleaning Smart Tv Screen With Microfiber Cloth
Anand T
|

Updated on: Apr 28, 2026 | 6:30 AM

Share

లక్షల రూపాయలు పోసి కొన్న టీవీ ఎక్కువ కాలం మన్నాలంటే దాని నిర్వహణ చాలా ముఖ్యం. అయితే గ్రామాల్లో ఉండే కొందరు ఇంట్లో దొరికే ఏ క్లాత్ పడితే ఆక్లాత్‌ను నీటిలో ముంచి టీవీ స్క్రీన్‌ను తూడుస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదం. టీవీ స్క్రీన్ చాలా సున్నితంగా ఉంటుంది. పాత బట్టలు లేదా కెమికల్స్ వాడితే స్క్రీన్ నాణ్యత తగ్గడమే కాకుండా, స్క్రాచ్‌లు పడే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు స్క్రీన్ పాడైపోవచ్చు. కూడా కాబట్టి టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సులభంగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం.

స్లార్ట్‌ టీవీ క్లీన్ చేయడానికి సులభమైన చిట్కాలు ఇవే

టీవీ ఆఫ్ చేసి, ప్లగ్ తొలగించండి: ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును శుభ్రం చేసే ముందు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయడం ముఖ్యం. టీవీ ఆన్ లో ఉన్నప్పుడు స్క్రీన్ వేడిగా ఉంటుంది, దీనివల్ల క్లీనింగ్ లిక్విడ్ మచ్చలు పడే అవకాశం ఉంది. అంతే కాదు మీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడే దానిపై ఉన్న ధూళి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ టీవీని ఆఫ్‌లో ఉంచే క్లీన్ చేయండి

మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే వాడండి: సాధారణ తువ్వాళ్లు లేదా టిష్యూ పేపర్లతో జనాలు టీవీలను క్లీన్ చేస్తారు. కానీ వాటికి బదులుగా మైక్రోఫైబర్ బట్టను మాత్రమే వాడండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది, స్క్రీన్‌పై గీతలు పడకుండా ధూళిని శుభ్రం చేస్తుంది.

లిక్విడ్‌ను నేరుగా స్క్రీన్‌పై చల్లకండి: మీరు టీవీ క్లీన్ చేసేప్పుడు క్లీనింగ్ లిక్విడ్ లేదా నీటిని ఎప్పుడూ నేరుగా టీవీ స్క్రీన్‌పై స్ప్రే చేయకూడదు. ముందుగా మైక్రోఫైబర్ బట్టపై కొద్దిగా లిక్విడ్ చల్లి, ఆ తర్వాత ఆ బట్టతో స్క్రీన్‌ను నెమ్మదిగా తుడవాలి.

సరైన క్లీనర్‌ను ఎంచుకోండి: టీవీని క్లనీ చేసేందుకు సబ్బు నీరు, విండో క్లీనర్లు , ఆల్కహాల్ లేదా అమ్మోనియా ఉన్న ద్రవాలను వాడకండి. టీవీ స్క్రీన్ల కోసం ప్రత్యేకంగా వచ్చే స్క్రీన్ క్లీనింగ్ కిట్ లేదా డిస్టిల్డ్ వాటర్ మాత్రమే వాడండి.

శుభ్రం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలా మంది గరుకైన బట్టలు లేదా పేపర్ టవల్స్‌తో స్క్రీన్ క్లీన్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా దాని మీద చిన్న చిన్న గీతలు పడతాయి. కాబట్టి వీలైనంత వరకు వాటిని వాడకండి. అలాగే టీవీని క్లీన్ చేసేందుకు ఎప్పుడూ విండో క్లీనర్స్ వాడకండి. దీని స్మార్ట్ టీవీలపై ఉండే యాంటీ-గ్లేర్ కోటింగ్ పాడైపోతుంది. అంతేకాదు స్క్రీన్ మీద నేరుగా నీళ్లు చల్లితే, అవి నేరుగా లోపలికి వెళ్లి సర్క్యూట్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ టీవీపై నీరు పడనీయకండి. స్క్రీన్‌ను బలంగా నొక్కి తుడవడం వల్ల లోపల ఉండే పిక్సెల్స్ దెబ్బతిని నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు కాబట్టి క్లీన్ చేసేప్పుడు సున్నితంగా తుడవండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us