డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు అస్సలు తొందరపడకండి..! ఫస్ట్ ఇవి టెస్ట్ చేయండి..!
ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తున్నారు. రోజూ తినే ఆహారంలో పోషకాలు ఉండే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మందికి అలవాటైంది. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి. కానీ అవి ఎంత మంచిగా ఉన్నాయనేదే ముఖ్యమైన విషయం. మంచి డ్రై ఫ్రూట్స్ కొనాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు వాటిని ఎలా ప్యాక్ చేశారో చూడాలి. మంచి బ్రాండ్లు శుభ్రంగా ప్యాకింగ్ చేస్తాయి. ప్యాకెట్‌పై తయారీ తేదీ, ఎప్పటి వరకు వాడొచ్చో స్పష్టంగా ఉందో లేదో చూడాలి. పాత తేదీ ఉన్నవి కాకుండా కొత్తగా వచ్చినవి తీసుకోవడం మంచిది. ప్యాకెట్ పారదర్శకంగా ఉంటే లోపల డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ముందుగానే చూడొచ్చు.
కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. ఇవి మన ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే Preservative Free అని రాసి ఉన్నవే తీసుకోవాలి. ప్యాకెట్‌పై ఉన్న లేబుల్ చదివితే దీని గురించి తెలుస్తుంది. సహజంగా తయారు చేసినవే మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
డ్రై ఫ్రూట్స్ కొనే ముందు అవి ఎంత తాజాగా ఉన్నాయో చూడాలి. పాత డ్రై ఫ్రూట్స్‌లో వాసన మారిపోతుంది, రుచి కూడా బాగోదు. తాజాగా ఉన్న వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మార్కెట్లో కొన్నప్పుడు వాసన, రంగు చూడటం, ప్యాక్ చేసిన తేదీ చూడటం మంచి అలవాటు. అలా కాకుండా పాతవి తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడొచ్చు.
చాలా బ్రాండ్లు ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఉన్నవి ఎంచుకోవడం కష్టం. అందుకే మంచి పేరున్న షాపుల్లో, నమ్మకమైన స్టోర్లలోనే కొనాలి. సూపర్ మార్కెట్లు, ఆర్గానిక్ స్టోర్లలో డ్రై ఫ్రూట్స్ కొనడం మంచిది. అక్కడ క్వాలిటీని చూసుకుంటారు కాబట్టి నకిలీ వాటి నుంచి దూరంగా ఉండొచ్చు.
కొత్తగా ఏదైనా బ్రాండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకునే ముందు చిన్న ప్యాకెట్ కొనాలి. వాసన, రుచి, రంగు అన్నీ చూసి నచ్చితేనే తర్వాత ఎక్కువ కొనాలి. మొదట్లోనే పెద్ద ప్యాకెట్ తీసుకుంటే క్వాలిటీ బాగోకపోతే నష్టపోతాం.
బాదం, వాల్ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని జాగ్రత్తగా ఎంచుకుంటేనే లాభం ఉంటుంది. పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకుంటే మంచి క్వాలిటీ ఉన్న, తాజాగా ఉన్న, హానికరమైన పదార్థాలు లేని డ్రై ఫ్రూట్స్ కొనొచ్చు. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
