మీ హైట్‌కు తగ్గట్టు మీరు ఎంత బరువు ఉండాలో తెలుసా..? 99శాతం మందికి ఇది తెలియదు..

మీ ఎత్తుకు తగిన ఆరోగ్యకరమైన బరువు ఎంత ఉండాలో మీకు తెలుసా? చాలా మంది బరువు అనే నెంబర్ పైనే దృష్టి పెడతారు కానీ ఎత్తుకు తగిన బరువును మెయింటైన్ చేయడం అనేది ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతుంటారు. మరి మీ ఎత్తుకు మీరు పర్‌ఫెక్ట్ బరువు ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? అసలు ఏ హైట్‌కు ఎంత బరువు ఉండాలి అనేది తెలుసుకుందాం..

మీ హైట్‌కు తగ్గట్టు మీరు ఎంత బరువు ఉండాలో తెలుసా..? 99శాతం మందికి ఇది తెలియదు..
What Is The Ideal Weight For Your Height

Updated on: May 28, 2026 | 7:06 PM

ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా బరువు పెరిగిపోతున్నామనో.. లేక బాగా తగ్గిపోతున్నామనో తెగ బాధపడిపోతుంటారు. బరువు తగ్గడం కోసం జిమ్‌ల చుట్టూ తిరగడం, రకరకాల కఠినమైన డైట్లు చేయడం చేస్తుంటారు. కానీ అసలు మీ ఎత్తుకు తగిన ఆరోగ్యకరమైన బరువు ఎంత ఉండాలో మీకు తెలుసా? చాలా మంది బరువు పెరగడం, తగ్గడం అనే అంశాలపైనే దృష్టి పెడతారు కానీ ఎత్తుకు తగిన బరువును మెయింటైన్ చేయడం అనేది ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతుంటారు. మరి మీ ఎత్తుకు మీరు పర్‌ఫెక్ట్ బరువు ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? దానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న సులభమైన పద్ధతులు మరియు మీ ఎత్తును బట్టి మీరు ఎన్ని కిలోలు ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎత్తు, బరువుల మధ్య ఉన్న నిష్పత్తిని లెక్కించడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే పద్ధతి BMI. దీనిని లెక్కించడం చాలా సులభం. మీ బరువును కిలోగ్రాములలో తీసుకుని, దానిని మీ ఎత్తు యొక్క వర్గంతో అంటే మీటర్లలో భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తారు. ఈ BMI రీడింగ్ గనుక 18.5 కంటే తక్కువ ఉంటే వారు తక్కువ బరువు ఉన్నారని, 18.5 నుండి 24.9 వరకు ఉంటే సరైన ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నారని అర్థం. అలాగే ఈ రీడింగ్ 25 నుండి 29.9 వరకు ఉంటే అధిక బరువుగా, 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయంతో పాటు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ BMI అనేది శరీరంలో ఉన్న కొవ్వును ఎల్లప్పుడూ కచ్చితంగా ప్రతిబింబించదు. ఉదాహరణకు.. క్రీడాకారులు లేదా అథ్లెట్లలో కండరాల పరిమాణం ఎక్కువగా ఉండటం కారణంగా వారి శరీరంలో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ BMI రేటింగ్ ఎక్కువగా చూపించవచ్చు. అందుకే శరీరంలో ఉన్న కొవ్వు స్థాయిలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి కేవలం BMI పైనే ఆధారపడకుండా నడుము చుట్టుకొలత, ఎత్తు మధ్య ఉన్న నిష్పత్తిని కూడా చూడటం చాలా అవసరం. ఆరోగ్య సూత్రాల ప్రకారం ఎప్పుడైనా సరే మీ నడుము చుట్టుకొలత మీ మొత్తం ఎత్తులో సగం కంటే తక్కువగా ఉంచుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

ఇక సాధారణంగా ఏ ఎత్తు ఉన్నవారు ఎన్ని కిలోల బరువు ఉండాలో చూస్తే.. 4 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న పురుషులకు అవసరమైన బరువు 41 నుండి 52 కిలోలు కాగా, మహిళలకు 38 నుండి 49 కిలోగ్రాములు ఉండాలి. అలాగే 5 అడుగుల ఎత్తు ఉన్న పురుషులు 44 నుండి 56 కిలోలు, మహిళలు 41 నుండి 53 కిలోల బరువు ఉండాలి. ఒకవేళ మీ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉంటే పురుషులు 48 నుండి 60 కిలోలు, మహిళలు 45 నుండి 57 కిలోల బరువు మెయింటైన్ చేయాలి. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తుకు పురుషులు 53 నుండి 66 కిలోలు, మహిళలు 49 నుండి 62 కిలోల బరువు ఉండటం ఐడియల్.

ఇదే పద్ధతిలో 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న పురుషులకు అవసరమైన ఆరోగ్యకరమైన బరువు 57 నుండి 71 కిలోలు కాగా, మహిళలకు 53 నుండి 67 కిలోలు ఉండాలి. కాస్త పొడవుగా ఉండే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న పురుషులు 62 నుండి 76 కిలోలు, మహిళలు 57 – 72 కిలోల బరువు ఉండటం మంచిది. చివరగా బాగా పొడవుగా ఉండే 6 అడుగుల ఎత్తు ఉన్న పురుషులకు అవసరమైన బరువు 71 నుండి 87 కిలోలు కాగా అదే ఎత్తు ఉన్న మహిళలకు 65 నుండి 80 కిలోలు ఉండాలి. కాబట్టి ఈ వివరాలను బట్టి మీ ఎత్తుకు తగ్గట్టుగా మీరు కరెక్ట్ బరువు ఉన్నారో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ బరువులో హెచ్చుతగ్గులు ఉంటే కంగారు పడకుండా మంచి పౌష్టికాహారం, రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుని ఫిట్‌నెస్‌ను కాపాడుకోండి.

Follow Us