Mother Feeding: బిడ్డకు తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి? తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివి..

పుట్టిన బిడ్డకు తల్లి పాలు అమృతం లాంటిది. అంతేకాదు.. వారు ఆరోగ్యంగా ఉండేందుకు గొప్ప మెడిసిన్ వంటివి. పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు శిశువుకు తల్లి పాలను పట్టాలి. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. అందుకే తల్లి పాలనే బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. మొదటి ఆరునెలలు బిడ్డ శరీర అవసరాలన్నీ తల్లి తల్లి పాల ద్వారానే తీరుతాయి.

Mother Feeding: బిడ్డకు తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి? తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివి..
Mother Feeding

Updated on: Jul 28, 2023 | 10:51 PM

పుట్టిన బిడ్డకు తల్లి పాలు అమృతం లాంటిది. అంతేకాదు.. వారు ఆరోగ్యంగా ఉండేందుకు గొప్ప మెడిసిన్ వంటివి. పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు శిశువుకు తల్లి పాలను పట్టాలి. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. అందుకే తల్లి పాలనే బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. మొదటి ఆరునెలలు బిడ్డ శరీర అవసరాలన్నీ తల్లి తల్లి పాల ద్వారానే తీరుతాయి. కొంతమంది స్త్రీలు తమ బిడ్డలకు చాలా తక్కువ కాలం పాటు, మరికొందరు చాలా ఎక్కువ కాలం పాటు తమ పిల్లలకు పాలు ఇస్తారు. కానీ చాలా మందికి తల్లిపాలు ఎంతకాలం సరైనదో ఖచ్చితంగా తెలియదు. మరి పిల్లలకు ఎంత కాలం వరకు పాలు ఇవ్వాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

శిశువుకు ఎన్ని నెలలు తల్లిపాలు ఇవ్వాలి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ఎందుకంటే తల్లి మొదటి పాలు శిశువు పెరుగుదల, ఆరోగ్యానికి చాలా కీలకం. పోషకాలను అందిస్తుంది. శిశువుకు ఆరు నెలల పాటు తల్లి పాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత బిడ్డకు కొద్దిగా జీర్ణమయ్యే ఘన పదర్థాలతో పాటు తల్లిపాలు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. బిడ్డకు ఘనాహారం పెట్టినప్పటికీ.. దాదాపు 2 సంవత్సరాల వయస్సు వరకు తల్లి పాలు ఇవ్వాలి. ఇంతకంటే తక్కువకు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఎదుగుదల కుంటుపడే అవకాశం ఉంది.

రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ 6 నెలల వరకు బిడ్డ ఆకలితో ఉన్నంత తరచుగా తల్లిపాలు ఇవ్వాలి. అంటే బిడ్డ ఆకలితో ఏడ్చినప్పుడల్లా తల్లిపాలు పట్టించాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు.

ఇవి కూడా చదవండి

బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు..

1. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలు అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు. పిల్లల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

2. తల్లి మొదటి పాలలో colostrum అనే ద్రవం ఉంటుంది. ఇది బిడ్డకు అమృతం లాంటిది. ఇందులో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

3. తల్లి పాలు తాగే పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది.

4. తల్లి పాలు తాగే పిల్లలకు ఊబకాయం సమస్య తక్కువగా ఉంటుంది.

పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు..

1. బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు శరీరంపై మచ్చలు ఏర్పడుతాయి. తల్లి పాలివ్వడం ద్వారా ఆ గాయాలు వేగంగా నయం అవుతాయి. తల్లి పాలివ్వడం వల్ల గర్భం తర్వాత వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, రక్తస్రావం వంటి సమస్యలు త్వరగా అదుపులోకి వస్తాయి.

2. తల్లిపాలు తల్లి, బిడ్డల మధ్య మంచి బంధాన్ని ఏర్పరుస్తాయి. దీని కారణంగా.. పిల్లలు తమ తల్లిని చాలా త్వరగా గుర్తిస్తారు.

3. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ శరీర బరువు పెరుగుతుంది. తల్లిపాలు బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

4. తల్లి పాలివ్వడం వల్ల తల్లి శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఎక్కువ శక్తి పొందుతుంది.

5. తల్లి పాలివ్వడం వల్ల తల్లి గర్భాశయంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..