సంపూర్ణ ఆరోగ్యానికి తగినంత నిద్ర అవసరం. కాబట్టి, నిద్రించడానికి ఒక నిర్దిష్ట సమయం కూడా కేటాయించాలి. మీరు సరైన సమయంలో సరిగ్గా నిద్రపోతే మాత్రమే గుండె ఆరోగ్యానికి మంచిది. అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 1.5 గంటలు ఆలస్యంగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి హానికరం. నిద్రలేమి గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఈ అధ్యయనంలో ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి పడుకునే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉందని గుర్తించారు. నిద్రలేమి మన హృదయాన్ని మాత్రమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రోజూ నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్రవేళలో ఆలస్యం సెల్యులార్ దెబ్బతినడం, వాపు, గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పడుకోండి. అలాగే, మంచి నిద్ర పొందండి. మీరు మీ నిద్ర షెడ్యూల్‌ను ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గించుకోండి: అధిక ఒత్తిడి నిద్ర సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం. ధ్యానం, యోగా, వాకింగ్ మొదలైనవి మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, వ్యాయామం కూడా ముఖ్యం. వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, ఇది శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను సృష్టిస్తుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. కానీ, వ్యాయామం చేసిన వెంటనే నిద్రపోవడం తప్పు.
రాత్రిపూట ఫోన్ వాడొద్దు: నిద్రపోయే ముందు ఫోన్ వాడటం మనకు అలవాటు. దీని ద్వారా వెలువడే నీలి కాంతి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఫోన్ వాడటం వల్ల మెదడుకు విశ్రాంతి లభించదు. కాబట్టి పడుకునే గంట ముందు ఫోన్ వాడటం మానేయండి. అలాగే, ఆహారం పట్ల కూడా శ్రద్ధ అవసరం. పడుకునే ముందు కాఫీ, టీ, పొగాకు, మద్యం తీసుకోవద్దు. ఎక్కువ ఆయిల్ లేదా స్పైసీ ఫుడ్ తినకూడదు. తిన్న వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే దీంతో మీ నిద్ర చక్రం దెబ్బతింటుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
నిద్రపోయే సమయాన్ని సెట్ చేసుకోండి. ప్రతిరోజూ నిద్రించడానికి, మేల్కొవడానికి సమయాన్ని సెట్ చేయండి. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేవడానికి ప్రయత్నించండి. తద్వారా మీ శరీరం ఆ సమయంలో నిద్రపోవడానికి అలవాటుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..